BJPపై పోరుకు సిద్ధమైన MRPS.. మార్చి 20న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా
ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా చేసిన మోసానికి నిరసన మార్చి 15న రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదారులను దిగ్బంధం బండి యాత్రలో మాదిగలకు ఏది భరోసా మండలాల నుంచి రాష్ట్ర రాజధానికి పాదయాత్రలు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు రెండున్నర దశాబ్దాలుగా ఎస్సీలలో వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ (Manda krishna madiga)మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వర్గీకరణకు బిజెపి ఇచ్చిన హామీని తుంగలో తొక్కినందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జాతీయ […]

- ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా చేసిన మోసానికి నిరసన
- మార్చి 15న రెండు రాష్ట్రాల్లో జాతీయ రహదారులను దిగ్బంధం
- బండి యాత్రలో మాదిగలకు ఏది భరోసా
- మండలాల నుంచి రాష్ట్ర రాజధానికి పాదయాత్రలు
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపు
రెండున్నర దశాబ్దాలుగా ఎస్సీలలో వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగ (Manda krishna madiga)మరోసారి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు. వర్గీకరణకు బిజెపి ఇచ్చిన హామీని తుంగలో తొక్కినందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో జాతీయ రహదారుల దిగ్బంధానికి సిద్ధమయ్యారు. సమస్య దేశవ్యాప్తంగా (country wide) చర్చ జరిగేందుకు మరోసారి దశల వారి పోరాట కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఈనెల 22 నుంచి ప్రారంభించి.. వివిధ కార్యక్రమాలను వచ్చే నెల 20వ తేదీ వరకు చేపట్టేందుకు కార్యక్రమాన్ని రూపొందించినట్టు కృష్ణ మాదిగ ప్రకటించారు.
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: ఎస్సీ వర్గీకరణకు స్పష్టమైన హామీ ఇచ్చి మాదిగలను మోసం చేసిన బీజేపీపై సమరానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. వచ్చే నెల 15వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల పరిధిలో జాతీయ రహదారులను (Natinal highway s)దిగ్భందించే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వివరించారు. మాదిగ రిజర్వేషన్ ను సమర్థించే శక్తులు, ఎమ్మార్పీఎస్ (Mrps)నాయకులు, శ్రేణులు పెద్ద ఎత్తున కదలి వచ్చి ఈ జాతీయ రహదారుల దిగ్బంధాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. హనుమకొండ హరిత హోటల్లో (Haritha hotel) ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కృష్ణ మాదిగ మాట్లాడారు
దోషిగా నిలిచిన బిజెపి (BJP)
ఎస్సీల వర్గీకరణ విషయంలో బిజెపి నెంబర్ వన్ దోషిగా నిలిచిందన్నారు. ఎన్నికల మ్యానిపెస్టోలో (Manifesto) హామీ ఇచ్చి అమలు చేయకుండా మోసం చేసిన బీజేపీని నిలదీయాలని కృష్ణ మాదిగ కోరారు. కేంద్రంలో పూర్తి మెజారిటీ (mejarity)ఉన్నప్పటికీ కూడా బీజేపీ నిర్లక్ష్యం చేస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిన బిజెపిని ప్రజల్లో నిలదీస్తామని స్పష్టం చేశారు.
బండి యాత్రలో మాదిగలకు ఏది భరోసా
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా భరోసా యాత్ర తెలంగాణ ప్రజలకేమో గానీ… ఎస్సీలకు భరోసా ఇవ్వలేదు… ఇక తెలంగాణ ప్రజలకు ఏమి భరోసా ఇవ్వగలుగుతారంటూ విమర్శించారు. మార్చి 15న ఎస్సీల వర్గీకరణ కోసం మాదిగ విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో హైదరాబాద్, విజయవాడ రెండు జాతీయ రహదారుల పై నిరసన చేపడతామని తెలియజేశారు.
మండలాల నుంచి రాష్ట్ర రాజధానులకు పాదయాత్ర
రహదారుల దిగ్బంధం కార్యక్రమ విజయవంతం కోసం ఈ నెల 22 నుండి మార్చి 14 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని మండలాల నుండి రాష్ట్ర రాజధాని (state capital) వరకు పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు కృష్ణ మాదిగ చెప్పారు.
మార్చి 20న డిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా
ఎమ్మార్పీఎస్ చేపట్టిన వరుస ఆందోళన కార్యక్రమంలో భాగంగా మార్చి 20న ఎస్సీ వర్గీకరణ కోసం డిల్లీ లోని జంతర్ మంతర్ (janthar manthar)వద్ద భారీ ధర్నా నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమ విజయవంతం కోసం రెండు రాష్ట్రాల నుంచి మాదిగ శ్రేణులు తరలి వెళ్లనున్నట్లు ప్రకటించారు.
మంత్రుల సెగ్మెంట్లలో నిరసనలు
అనాధ పిల్లలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర మంత్రుల (ministers)నియోజకవర్గాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపడుతామని కృష్ణ మాదిగ చెప్పారు. బడ్జెట్ లో (budjet)మూడు లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పి అనాధ పిల్లలకు మూడు రూపాయలు కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నాయకుడు మంద కుమార్ మాదిగ, మహాజన్ సోషలిస్టు పార్టీ నాయకుడు తీగల ప్రదీప్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.