MS Dhoni | వ‌చ్చే ఐపీఎల్‌లో ధోని ఆడ‌తాడా.. హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడా.. సాక్షి చెప్పిన ఆస‌క్తిక‌ర విష‌యాలు

MS Dhoni: భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయ‌న కీపింగ్ స్కిల్స్‌కి, అద్భుత‌మైన బ్యాటింగ్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.గ్రౌండ్‌లో ఎప్పుడు కూల్‌గా ఉండే ధోని ఒక్కోసారి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ త‌మ జ‌ట్టుని గెలిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం అంత‌ర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన ధోని ప్ర‌స్తుతం ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో మోకాలి గాయంతో బాధ‌ప‌డుతూనే ఆడాడు మహేంద్ర సింగ్ ధోనీ. […]

  • By: sn    latest    Jul 31, 2023 5:46 PM IST
MS Dhoni | వ‌చ్చే ఐపీఎల్‌లో ధోని ఆడ‌తాడా.. హీరోగా ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడా.. సాక్షి చెప్పిన ఆస‌క్తిక‌ర విష‌యాలు

MS Dhoni: భార‌త మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనికి మ‌న‌దేశంలోనే కాదు విదేశాల‌లో కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఆయ‌న కీపింగ్ స్కిల్స్‌కి, అద్భుత‌మైన బ్యాటింగ్‌కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.గ్రౌండ్‌లో ఎప్పుడు కూల్‌గా ఉండే ధోని ఒక్కోసారి సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ త‌మ జ‌ట్టుని గెలిపిస్తుంటారు. కొన్నేళ్ల క్రితం అంత‌ర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ఇచ్చిన ధోని ప్ర‌స్తుతం ఐపీఎల్ ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023 సీజన్‌లో మోకాలి గాయంతో బాధ‌ప‌డుతూనే ఆడాడు మహేంద్ర సింగ్ ధోనీ. ఇదే ధోని చివ‌రి ఐపీఎల్ సీజ‌న్ అని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్ర‌మోట్ చేయ‌డంతో ఆయ‌న మ్యాచ్‌లు చూసేందుకు జ‌నాలు ఎగ‌బ‌డ్డారు.

ఐపీఎల్ 2023 సీజన్‌లో 16 మ్యాచులు ఆడిన మహేంద్రుడు కేవ‌లం 11 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్‌కి వచ్చాడు. అత‌ను 34.67 సగటుతో 104 పరుగులు చేయ‌గా, అత‌ని స్ట్రైయిక్ రేటు 185.71గా ఉంది.. అద్భుత‌మైన నిర్ణ‌యాలు తీసుకొని త‌న టీం సిరీస్ గెలిచేలా కూడా చేశాడు. ఇక వ‌చ్చే సీజ‌న్‌లో ధోని ఐపీఎల్ ఆడ‌తాడా లేదా అనే సందేహం అంద‌రిలో ఉంది. వాట‌న్నింటికి తాజాగా క్లారిటీ వ‌చ్చింది. ధోని తన సొంత ప్రొడక్షన్‌లో ‘ఎల్‌జీఎం’ అనే చిత్రం రూపొంద‌గా, ఈ మూవీ జూలై 28న విడుదలైంది. ఈ నేప‌థ్యంలో చెన్నైలోని ఓ థియేటర్‌లో సినిమా యూనిట్‌తో కలిసి మూవీ చూసిన మాహీ భార్య సాక్షి సింగ్, ధోనీ ఫ్యాన్స్‌కి అదిరిపోయే న్యూస్ చెప్పింది

ధోనీ ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఐపీఎల్ 2024 సీజన్‌లో త‌ప్ప‌క‌ ఆడతాడు…ఇక మ‌హేంద్ర సింగ్‌కి నటన కొత్తేమీ కాదు. ఇప్పటికే అనేక ప‌లు యాడ్స్‌లో నటించాడు. ఆయనకి కెమెరా భ‌యం ఏ మాత్రం లేదు. మంచి స్క్రిప్ట్ దొరికితే ఆయ‌న హీరోగా నటించడానికి కూడా రెడీగా ఉన్నాడు అని తెలియ‌జేసింది సాక్షి సింగ్ ధోనీ… ఇక ధోని భార్య సాక్షి సింగ్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని ప్రకటించడంతో మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ 2024 సీజన్ ఆడడం ఖాయమ‌ని తేలిపోయింది. ఇక మ‌హీ భార్య సాక్షి సింగ్ నిర్మించిన ‘ఎల్‌జీఎం’ మూవీకి యావరేజ్ టాక్ దక్కింది. చిత్రంలో హ‌రీష్‌ కళ్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించ‌గా, నదియా ముఖ్య పాత్రలో క‌నిపించి అల‌రించింది.