అటార్నీ జనరల్ పదవిని తిరస్కరించిన ముకుల్ రోహత్గీ
విధాత : సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ కేంద్ర ప్రభుత్వ ఆఫర్‌ను తిరస్కరించారు. మరోసారి అటార్నీ జనరల్ పదవిలో కొనసాగాలని రోహత్గీని కేంద్రం కోరగా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. 67 ఏండ్ల వయసున్న రోహత్గీ అటార్నీ జనరల్‌గా 2014 నుంచి 2017 జూన్ వరకు మూడేండ్ల పాటు కొనసాగారు. ఆ తర్వాత కేకే వేణుగోపాల్‌ను కేంద్రం అటార్నీ జనరల్‌గా నియమించింది. ఆయన 2020 వరకు ఆ పదవిలో కొనసాగారు. తన వయస్సు దృష్ట్యా తన బాధ్యతల నుండి […]

విధాత : సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ కేంద్ర ప్రభుత్వ ఆఫర్‌ను తిరస్కరించారు. మరోసారి అటార్నీ జనరల్ పదవిలో కొనసాగాలని రోహత్గీని కేంద్రం కోరగా, ఆయన సున్నితంగా తిరస్కరించారు. 67 ఏండ్ల వయసున్న రోహత్గీ అటార్నీ జనరల్‌గా 2014 నుంచి 2017 జూన్ వరకు మూడేండ్ల పాటు కొనసాగారు.
ఆ తర్వాత కేకే వేణుగోపాల్‌ను కేంద్రం అటార్నీ జనరల్‌గా నియమించింది. ఆయన 2020 వరకు ఆ పదవిలో కొనసాగారు. తన వయస్సు దృష్ట్యా తన బాధ్యతల నుండి తప్పించాలని ప్రభుత్వాన్ని కేకే వేణుగోపాల్ అభ్యర్థించారు. కానీ ప్రభుత్వం మరో పర్యాయం కొనసాగాలని చెప్పింది. కానీ రెండేండ్లు మాత్రమే ఆయన ఆ పదవిలో కొనసాగారు. సెప్టెంబర్ 30తో కేకే వేణుగోపాల్ పదవీకాలం ముగియనుంది. దీంతో మరోసారి అటార్నీ జనరల్‌గా కొనసాగాలని ముకుల్ రోహత్గీని కేంద్రం సంప్రదించింది. కానీ రోహత్గీ తిరస్కరించారు.