Telangana | తెలంగాణ‌లో భారీగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ..!

Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది.. ప్ర‌భుత్వం భారీగా బ‌దిలీలు చేప‌ట్టింది. నిన్న ఐఏఎస్ ఆఫీస‌ర్లు, ఆర్డీవోలను బ‌దిలీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీల‌ను చేప‌ట్టింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొత్తం 22 మంది క‌మిష‌న‌ర్ల‌ను బ‌దిలీ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. బ‌డంగ్‌పేట మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా బీ సుమ‌న్ రావు, రామ‌గుండం కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా సీహెచ్ నాగేశ్వ‌ర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌గా కే నారాయ‌ణ‌రావు, ద‌మ్మాయిగూడ […]

Telangana | తెలంగాణ‌లో భారీగా మున్సిపల్‌ కమిషనర్ల బదిలీ..!

Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది.. ప్ర‌భుత్వం భారీగా బ‌దిలీలు చేప‌ట్టింది. నిన్న ఐఏఎస్ ఆఫీస‌ర్లు, ఆర్డీవోలను బ‌దిలీ చేసిన రాష్ట్ర ప్ర‌భుత్వం తాజాగా మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ల బ‌దిలీల‌ను చేప‌ట్టింది. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. మొత్తం 22 మంది క‌మిష‌న‌ర్ల‌ను బ‌దిలీ చేస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వుల్లో పేర్కొంది.

బ‌డంగ్‌పేట మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా బీ సుమ‌న్ రావు, రామ‌గుండం కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్‌గా సీహెచ్ నాగేశ్వ‌ర్, జీహెచ్ఎంసీ డిప్యూటీ క‌మిష‌న‌ర్‌గా కే నారాయ‌ణ‌రావు, ద‌మ్మాయిగూడ మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్‌గా ఎస్ రాజ‌మ‌ల్ల‌య్య‌ను, సీడీఎంఏ కార్యాల‌యంలో జాయింట్ డైరెక్ట‌ర్‌గా టీ మోహ‌న‌కృష్ణ రెడ్డిని ప్ర‌భుత్వం నియ‌మించింది. బీ గీత‌ను సీడీఎంఏ నుంచి జీహెచ్ఎంసీకి బ‌దిలీ చేసింది.