Earth-Like Planet | నెఫ్ట్యూన్ ఆవల పదో గ్రహం.. భూమిలానే ఉండే అవకాశం!
Earth-Like Planet | విధాత: అంతరిక్ష పరిశోధనలు ఏమైనా వాటి ముఖ్య ఉద్దేశం భూమి లాంటి గ్రహం మరేదైనా ఉందా అని కనుక్కోవడమే. భూమిపై జీవించడానికి అనువు కాని పరిస్థితులు ఏర్పడితే మానవ జాతిని అక్కడ కొనసాగించాలనేది ఒక ఆలోచన. అయితే ఇప్పటివరకు భూమిలా మానవులకు సరిపోయే గ్రహాలను శాస్త్రవేత్తలను కనుగొనలేక పోయారు. తాజాగా జపాన్‌లోని కిండాయ్ యూనివర్సిటీ, జపాన్ నేషనల్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దీనికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన అంశం బయట […]
Earth-Like Planet |
విధాత: అంతరిక్ష పరిశోధనలు ఏమైనా వాటి ముఖ్య ఉద్దేశం భూమి లాంటి గ్రహం మరేదైనా ఉందా అని కనుక్కోవడమే. భూమిపై జీవించడానికి అనువు కాని పరిస్థితులు ఏర్పడితే మానవ జాతిని అక్కడ కొనసాగించాలనేది ఒక ఆలోచన.
అయితే ఇప్పటివరకు భూమిలా మానవులకు సరిపోయే గ్రహాలను శాస్త్రవేత్తలను కనుగొనలేక పోయారు. తాజాగా జపాన్‌లోని కిండాయ్ యూనివర్సిటీ, జపాన్ నేషనల్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ సంయుక్తంగా నిర్వహించిన పరిశోధనలో దీనికి సంబంధించి ఒక ఆశ్చర్యకరమైన అంశం బయట పడింది.
భూమి లాంటి మరో గ్రహం మన సౌర వ్యవస్థలోనే ఉందని, ప్రస్తుతం సౌర కుటుంబంలో చివరి గ్రహంగా భావిస్తున్న నెఫ్టూన్ ఆవల ఇది పరిభ్రమిస్తోందని ఆ నివేదికలో పరిశోధకులు పేర్కొన్నారు.
ద ఆస్ట్రనామికల్ జర్నీ అనే జర్నల్‌లో ఈ అధ్యయనం ప్రచురితమైంది. ‘కూపర్ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతంలో ఒక గ్రహం ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సౌర కుటుంబం తొలి రోజుల్లో ఇక్కడ కూడా గ్రహాలు ఉండేవి.
దీనిపై పరిశోధన చేయగా మనకు ఇంకా కనపడని ఓ అంతుచిక్కని గ్రహం అక్కడే ఉందనే అనిపిస్తోంది. ఒక వేళ ఈ గ్రహం నిజంగా ఉంటే అది సూర్యునికి 250 నుంచి 500 ఆస్ట్రనామికల్ యూనిట్ల దూరంలో ఉండే అవకాశం ఉంది. పైగా అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం..ఆ గ్రహంపై మానవాళి జీవించే పరిస్థితులు ఉండే అవకాశం ఉంది’ అని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram