Nalgonda | ఇకనైనా ఇండ్లు.. ఉద్యోగాలు ఇవ్వండి: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Nalgonda విధాత: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు పేదలకు ఇండ్లు, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా తనకు నచ్చిన వాస్తు కోసం నూతన సచివాలయం నిర్మించుకున్నారని, ఇక ముందైనా ఆయన పేదలకు ఇండ్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తాను కోరినట్లుగా నిర్మించుకున్న సచివాలయానికైన కేసీఆర్ రోజు వస్తారని ఆశిస్తున్నాననన్నారు. నూతన సచివాలయానికి పేరుకు 1000 కోట్లు అని చెబుతున్నా 3వేల కోట్ల మేరకు ఖర్చవుతుందన్నారు. సచివాలయానికి […]

Nalgonda
విధాత: సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఇన్నాళ్లు పేదలకు ఇండ్లు, యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా తనకు నచ్చిన వాస్తు కోసం నూతన సచివాలయం నిర్మించుకున్నారని, ఇక ముందైనా ఆయన పేదలకు ఇండ్లు యువతకు ఉద్యోగాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మాజీమంత్రి, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. తాను కోరినట్లుగా నిర్మించుకున్న సచివాలయానికైన కేసీఆర్ రోజు వస్తారని ఆశిస్తున్నాననన్నారు.
నూతన సచివాలయానికి పేరుకు 1000 కోట్లు అని చెబుతున్నా 3వేల కోట్ల మేరకు ఖర్చవుతుందన్నారు. సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టారని ఇకనైనా ఆయన ఆశయాలకు అనుగుణంగా అణగారిన వర్గాల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం పని చేయాలన్నారు. సచివాలయానికి ప్రజలను, మీడియాను అనుమతించాలని అప్పుడే పరిపాలన లక్ష్యాలు, ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు.
ఆదివారం ఆయన తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరు మండలం అనాజిపురం గ్రామానికి చెందిన వల్లందాస్ గణేష్ కుటుంబాన్ని పరామర్శించి 50వేల ఆర్థిక సహాయం అందించారు.