Nalgonda: నకిలీ రేషన్‌ కార్డుల తయారీ.. 9 గ్రామాల రేష‌న్ డీలర్లపై కేసు..!

నకిలీ కార్డుల తయారు చేసి విక్ర‌యిస్తున్నార‌ని త‌హ‌సీల్దార్ ఫిర్యాదు విధాత: నకిలీ రేషన్ కార్డులను తయారు చేసిన నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రభుత్వ రేషన్ డీలర్లపై కేసు నమోదు చేసినట్లు గుర్రంపోడ్ ఎస్ఐ శివ ప్రసాద్ బుధవారం మీడియాకు తెలిపారు. మండలంలోని కొప్పోలు, లక్ష్మి దేవిగూడెం, కోయుగురోనిబావి, వెంకటాపురం, అములూర్, చామిలేడు, జూనూతల, ఉట్లపల్లి, చేపూరు, తేనేపల్లి గ్రామాల రేషన్ డీలర్స్ నకిలీ రేషన్ కార్డులు తయారు చేశారని గుర్రంపోడ్ తహశీల్దార్ ఇంద్రవల్లి […]

Nalgonda: నకిలీ రేషన్‌ కార్డుల తయారీ.. 9 గ్రామాల రేష‌న్ డీలర్లపై కేసు..!
  • నకిలీ కార్డుల తయారు చేసి విక్ర‌యిస్తున్నార‌ని త‌హ‌సీల్దార్ ఫిర్యాదు

విధాత: నకిలీ రేషన్ కార్డులను తయారు చేసిన నల్గొండ జిల్లా గుర్రంపోడ్ మండలంలోని తొమ్మిది గ్రామాల ప్రభుత్వ రేషన్ డీలర్లపై కేసు నమోదు చేసినట్లు గుర్రంపోడ్ ఎస్ఐ శివ ప్రసాద్ బుధవారం మీడియాకు తెలిపారు.

మండలంలోని కొప్పోలు, లక్ష్మి దేవిగూడెం, కోయుగురోనిబావి, వెంకటాపురం, అములూర్, చామిలేడు, జూనూతల, ఉట్లపల్లి, చేపూరు, తేనేపల్లి గ్రామాల రేషన్ డీలర్స్ నకిలీ రేషన్ కార్డులు తయారు చేశారని గుర్రంపోడ్ తహశీల్దార్ ఇంద్రవల్లి హుస్సేన్ స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కార్డు తీసుకోకపోతే రేషన్ బియ్యం రావని ప్రజలను భయపెట్టి ఒక్కొ రేషన్ కార్డు దారుని వద్ద నుంచి సదరు డీలర్లు 200 రూపాయల చొప్పున వసూలు చేశార‌న్నారు. ఇలా 710 నకిలీ కార్డులను విక్రయించి ప్రభుత్వాన్ని మోసం చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

పౌరసరఫరాల శాఖ అధికారులు సైతం దీనిపై విచారణ చేసి కలెక్టర్‌కు నివేదిక అందించారు. కాగా తహశీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో తొమ్మిది గ్రామాల ప్రభుత్వ డీలర్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంపోడ్ ఎస్ ఐ శివ ప్రసాద్ తెలిపారు.