KDCCB కి జాతీయ అవార్డు.. వరుసగా ఏడోసారి
KDCCB చొప్పదండి పీఏసీఎస్ కూ మొదటిస్థానం విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం జాతీయ అవార్డు దక్కించుకుంది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి దేశంలోనే రెండవ అత్యుత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందింది. దేశవ్యాప్తంగా ఉన్న 393 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో పోటీ పడి కరీంనగర్ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. ఈనెల 16న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో జరిగే […]

KDCCB
చొప్పదండి పీఏసీఎస్ కూ మొదటిస్థానం
విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వరుసగా రెండో ఆర్థిక సంవత్సరం జాతీయ అవార్డు దక్కించుకుంది. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి దేశంలోనే రెండవ అత్యుత్తమ బ్యాంకుగా గుర్తింపు పొందింది.
దేశవ్యాప్తంగా ఉన్న 393 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులతో పోటీ పడి కరీంనగర్ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం. ఈనెల 16న రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్ లో జరిగే కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ సీఈవో ఎన్ సత్యనారాయణ ఈ అవార్డును అందుకోనున్నారు.
2015-16 మొదలుకొని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ వరుసగా ఆర్థిక లావాదేవీలు, నిర్వహణ, మెరుగైన పనితీరుతో జాతీయస్థాయి అవార్డులు గెలుచుకుంటూ వస్తోంది.
2015-16లో అఖిల భారత స్థాయిలో ద్వితీయ స్థానాన్ని, 2016-17లో తృతీయ స్థానాన్ని, 2017-18లో ద్వితీయ స్థానాన్ని, 2018-19లో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్న ఈ బ్యాంక్, 2020-21, 2021-22 సంవత్సరాల్లో సాధించిన తాజా అవార్డులతో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుండి 7 అవార్డులు గెలుచుకున్నట్టు అయింది.
చొప్పదండి పీఏసీఎస్ కూడా…
జిల్లాలోని చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం 2021-22 సంవత్సరానికి గాను దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిన పీఏసీఎస్ లలో మొదటి స్థానం దక్కించుకుంది. 2017-18, 2018-19, 2019-20, 2021-22 సంవత్సరాలలో చొప్పదండి పీఏసీఎస్ వరుసగా జాతీయ అవార్డులు సాధించింది. కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, చొప్పదండి పీఏసీఎస్ వరుస అవార్డులు సాధించడం పట్ల నాబర్డ్, టెస్కాబ్ అధికారులు బ్యాంకు సిబ్బంది, పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.