Chhattisgarh | ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి

Chhattisgarh | విధాత: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్‌బెడా అడవుల్లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ప్లాటూన్ నంబర్ 16 ఇంచార్జి మల్లేష్, కమాండర్ విమల, ఇంద్రావతి ఏరియా కమిటీ ఓర్చా ఎల్ఓఎస్ కమాండర్ దీపక్, ఓర్చా ఎల్జీఎస్ కమాండర్ రాంలాల్, ఏసీఎం ఇతరులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. కాగా.. ఉదయం 6 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో […]

Chhattisgarh | ఛత్తీస్‌ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు మృతి

Chhattisgarh |

విధాత: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని భట్‌బెడా అడవుల్లో మంగళవారం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల ప్లాటూన్ నంబర్ 16 ఇంచార్జి మల్లేష్, కమాండర్ విమల, ఇంద్రావతి ఏరియా కమిటీ ఓర్చా ఎల్ఓఎస్ కమాండర్ దీపక్, ఓర్చా ఎల్జీఎస్ కమాండర్ రాంలాల్, ఏసీఎం ఇతరులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది.

కాగా.. ఉదయం 6 గంటల ప్రాంతంలో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో యూనిఫాం ధరించిన నక్సలైట్‌ ఒకరు మృతి చెందారు. మృతదేహంతో పాటు 315 బోర్‌ రైఫిల్‌, 12 బోర్‌ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎన్‌కౌంటర్‌లో భద్రతా బలగాలకు ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, భద్రతా దళ సభ్యులందరూ సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.