Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లో 100 కేజీల పేలుడు పదార్థాలు, 16 ఐఈడీలు స్వాధీనం
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 100 కిలోల పేలుడు పదార్థాలతో పాటు 16 ఐఈడీలను, దుస్తులు, విప్లవ సాహిత్యంతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Chhattisgarh | దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు భద్రతా బలగాలు తమ కూంబింగ్‌ను కొనసాగిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే వందలాది మావోయిస్టులను హతమార్చగా, పలువురు లొంగిపోయారు. శనివారం నాడు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన భారీ డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. 100 కిలోల పేలుడు పదార్థాలతో పాటు 16 ఐఈడీలను, దుస్తులు, విప్లవ సాహిత్యంతో పాటు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
బీజాపూర్ జిల్లాలోని మద్దెడ్ పోలీసు స్టేషన్ పరిధిలోని బందెపాడ, నీలమర్గు గ్రామా మధ్య మావోయిస్టుల సంచారంతో పాటు భారీ ఎత్తున పేలుడు పదార్థాలు ఉన్నట్లు భద్రతా బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ పోలీసులు, 22వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ బలగాలు కూంబింగ్ నిర్వహించారు.
కూంబింగ్‌లో భాగంగా 100 కేజీల జిలెటిన్ స్టిక్స్, 16 ఐఈడీలు, 300 మీటర్లకు పైగా నలుపు రంగు వస్త్రం, వాకి టాకీ చార్జర్లు, బ్యాటరీలు, మావోయిస్టు సాహిత్యం, వంట సామాగ్రితో పాటు పలు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. మద్దెడ్ పీఎస్ పరిధిలో భారీ విధ్వంసానికి మావోయిస్టులు వ్యూహం రచించినట్లు పోలీసులు పేర్కొన్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి, విధ్వంసాన్ని నిరోధించగలిగామని పోలీసులు స్పష్టం చేశారు. ఆ ఏరియాలో మావోయిస్టుల ఆచూకీ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram