Ind vs WI: సెంచ‌రీకి చేరువలో విరాట్ కోహ్లీ.. మ‌ళ్లీ నిరాశ‌ప‌ర‌చిన గిల్, ర‌హానే

Ind vs WI: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్ సైకిల్‌లో భాగంగా వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న భార‌త్ తొలి టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించింది. ఇక అదే ఉత్సాహంతో గురువారం నుండి విండీస్‌తో రెండో టెస్ట్ ఆడుతుంది. ఒకే ఒక్క చేంజ్‌తో టీమిండియా బ‌రిలోకి దిగింది. శార్దూల్ ప్లేస్‌లో ముకేష్ వ‌చ్చాడు.టాస్ గెలిచి భార‌త్‌ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది విండీస్ జ‌ట్టు. ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు జ‌ట్టుకి అదిరిపోయే ఆరంభం అందించారు. […]

  • By: sn    latest    Jul 21, 2023 12:44 AM IST
Ind vs WI: సెంచ‌రీకి చేరువలో విరాట్ కోహ్లీ.. మ‌ళ్లీ నిరాశ‌ప‌ర‌చిన గిల్, ర‌హానే

Ind vs WI: వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్ షిప్ సైకిల్‌లో భాగంగా వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న భార‌త్ తొలి టెస్ట్‌లో ఘ‌న విజ‌యం సాధించింది. ఇక అదే ఉత్సాహంతో గురువారం నుండి విండీస్‌తో రెండో టెస్ట్ ఆడుతుంది. ఒకే ఒక్క చేంజ్‌తో టీమిండియా బ‌రిలోకి దిగింది. శార్దూల్ ప్లేస్‌లో ముకేష్ వ‌చ్చాడు.టాస్ గెలిచి భార‌త్‌ని బ్యాటింగ్ కి ఆహ్వానించింది విండీస్ జ‌ట్టు. ట్రినిడాడ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌కు ఓపెనర్లు జ‌ట్టుకి అదిరిపోయే ఆరంభం అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ ధనాధన్ ఆట ఆడుతూ స్కోర్ బోర్డ్ ప‌రుగెత్తించాడు. మరోవైపు య‌శ‌స్వి జైస్వాల్ కూడా వ‌న్డే త‌ర‌హా ఆట ఆడ‌డంతో జట్టుకు మంచి స్కోరు ల‌భించింది . తొలి ఇన్నింగ్స్ లంచ్ సమయానికి భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 121 పరుగులు చేయగా, ఆ త‌ర్వాత విండీస్ అద్భుత‌మైన బౌలింగ్ చేసి నాలుగు వికెట్స్ తీసారు.

రెండో టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భార‌త్ 84 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది .. రెండో సెష‌న్‌లోనే ఆ నాలుగు వికెట్స్ కోల్పోవ‌డం విశేషం. మూడో సెష‌న్‌లో రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి మరో వికెట్ దక్కకుండా జాగ్ర‌త్త‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం క్రీజులో 161 బంతుల్లో 8 ఫోర్లతో 87 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ తో పాటు 84 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ఉన్నారు. వీరిద్ద‌రు ఐదో వికెట్‌కి 106 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో టీమిండియాకి గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోర్ ద‌క్కింది.

అయితే లంచ్ బ్రేక్‌కి ముందు య‌శ‌స్వి స్లిప్‌లో క్యాచ్ ఇవ్వ‌గా, వారు జార‌విడ‌చారు. మంచి ఇన్నింగ్స్ కొన‌సాగించే అవకాశాన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు య‌శ‌స్వి. 74 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లోనే కిర్క్ మెక్‌కెంజీకి క్యాచ్ ఇచ్చి పెవీలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇక వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన శుబ్‌మన్ గిల్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసి కీమర్ రోచ్ బౌలింగ్‌లో జోషువా డి సిల్వకి క్యాచ్ ఔట‌య్యాడు. ఆ త‌ర్వాత 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసిన రోహిత్ శర్మ, వర్రీకాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. ఇక అజింకా రహానే, 36 బంతుల్లో 8 పరుగులు చేసి షాన్నన్ గ్యాబ్రియల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తొలి టెస్ట్‌లో నిరాశ‌ప‌ర‌చిన గిల్, ర‌హానే ఈ టెస్ట్‌లో కూడా నిరాశ‌ప‌రిచారు.