Secretariat | నూతన సచివాలయం.. ప్రత్యేకతలివే

Secretariat విధాత‌: డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం మధ్యాహ్నం 1.20 నుంచి 1.32 గంటల మధ్య ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభకానున్నది. సచివాలయ ప్రారంభ కార్యక్రమం 12 నిమిషాల్లో పూర్తి కానున్నది. సీఎం కేసీఆర్‌ మొదట యాగశాలను సందర్శించనున్నారు. అనంతరం సీఎం సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత వాస్తు పూజ మందిరానికి వెళ్లనున్నారు. ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో దస్త్రంపై సీఎం సంతకం చేయనున్నారు. మంత్రులు కూడా తమ ఛాంబర్లకు వెళ్లి దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. […]

Secretariat | నూతన సచివాలయం.. ప్రత్యేకతలివే

Secretariat

విధాత‌: డాక్టర్‌ బీ.ఆర్‌.అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం మధ్యాహ్నం 1.20 నుంచి 1.32 గంటల మధ్య ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభకానున్నది. సచివాలయ ప్రారంభ కార్యక్రమం 12 నిమిషాల్లో పూర్తి కానున్నది. సీఎం కేసీఆర్‌ మొదట యాగశాలను సందర్శించనున్నారు. అనంతరం సీఎం సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. తర్వాత వాస్తు పూజ మందిరానికి వెళ్లనున్నారు.

ఆరో అంతస్తులోని తన ఛాంబర్‌లో దస్త్రంపై సీఎం సంతకం చేయనున్నారు. మంత్రులు కూడా తమ ఛాంబర్లకు వెళ్లి దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. మధ్యాహ్నం 1.58 నుంచి అధికారులు ఛాంబర్లకు వెళ్లనున్నారు. కార్యాలయాల్లో దస్త్రాలపై అధికారులు సంతకాలు చేయనున్నారు. మధ్యాహ్నం 2.15 గంటలకు సీఎం ప్రసంగిస్తారు.

నూతన సచివాలయంలో పూర్ణహుతితో యాగం పరిపూర్ణమైంది. మంత్రి ప్రశాంత్‌రెడ్డి దంపతులు సుదర్శన, చండీ, వాస్తు హోమాలు నిర్వహించారు. సచివాలయానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చేరుకుంటున్నారు. సచివాలయం వద్ద భద్రతా ఏర్పాట్లను సీపీ సీవీ ఆనంద్‌ పరిశీలించారు.

ప్రత్యేకతలు:

ప్రాంగణ విస్తీర్ణం 27.9 ఎకరాలు
భవన నిర్మాణం 2.54 ఎకరాలు
భవన విస్తీర్ణం 10.52 చదరపు అడుగులు
భవనం ఎత్తు 265 అడుగులు

అంతస్తులు: లోయర్‌+గ్రౌండ్‌+ 6 అంతస్తులు
పచ్చదనం: 8 ఎకరాలు
పార్కింగ్‌: 560 కార్లు, 700 మోటార్‌ సైకిళ్లు,
విద్యుత్‌: 2,200 కేవీఏ
జనరేటర్లు: 3 (500 కేవీఏ)
ఉపయోగించిన సామాగ్రి: 3,500 ఘ. మీ.
నీటి వినియోగం: రోజుకు 125 కి. లీటర్లు
భూగర్భనీటి సంపు: 565 కి. లీటర్లు
34 గుమ్మటాలు: రెండు జాతీయ చిహ్నాలు
మహాద్వారం – 4 తలుపులు (29 అడుగులు వెడల్పు, 24 అడుగుల ఎత్తు)
సచివాలయం ప్రాంగణంలో మొత్తం 875 పైగా తలుపులు
ఉపయోగించిన ఉక్కు: 7000 టన్నులు
సిమెంటు: 35,000 టన్నులు
ఇసుక: 26,000 టన్నులు
కాంక్రీట్‌: 60,000 క్యూబిక్‌ మీటర్లు
ఇటుకలు: 11 లక్షలు
గ్రానైట్‌: 3. లక్షల చదరపు అడుగులు
మార్బుల్స్‌ : లక్ష చదరపు అడుగులు
ధోల్‌పుర్‌ రెడ్‌స్టోన్‌ 3,500 ఘ. మీ
కలప: 7,500 ఘనపు అడుగులు
కార్మికులు: 12,000 మంది (3 షిప్టులు)
ఆర్కిటెక్టులు: డాక్టర్‌ ఆస్కార్‌, పొన్ని కాన్సెస్సావో

గ్రౌండ్‌ ఫ్లోర్‌: ఎస్సీ సంక్షేమ అభివృద్ధి శాఖ, మైనారిటీ సంక్షేమ శాఖ, రెవెన్యూ, కార్మిక, ఉపాధి కల్పన శాఖలు
మొదటి అంతస్తు: హోం, విద్యా శాఖ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలు
రెండో అంతస్తు: వైద్యారోగ్యం, విద్యుత్‌ శాఖ, పశుసంవర్ధక, ఆర్థిక శాఖలు
మూడో అంతస్తు: మహిళా శిశు సంక్షేమం,గిరిజన సంక్షేమం,పురపాలక, పట్టణాభివృద్ధి-ప్లానింగ్‌, ఐటీ, వ్యవసాయ, సహకార, పరిశ్రమల, వాణిజ్య శాఖలు
నాలుగో అంతస్తు: పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, యువజన, పర్యాటక, బీసీ సంక్షేమం, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక, నీటిపారుదల, న్యాయ శాఖలు
అయిదో అంతస్తు: రవాణా,రహదారులు, భవనాల, సాధారణ పరిపాలన శాఖ
ఆరో అంతస్తు: లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో సీఎం కార్యాలయం, సీఎం పేషీ, కార్యదర్శలు ‘జన హిత’ పేరిట 250 మంది కూర్చునేలా హాల్‌, 30 మంది కూర్చునేలా క్యాబినెట్‌ హాల్‌, కలెక్టర్లతో సమావేశాలకు 60 మంది కూర్చునేలా హాల్‌, 50 మందితో సమావేశానికి మరో హాల్‌, 25 మంది ఆసీనులయ్యేలా డైనింగ్‌ హాల్‌.