Airport Pushpak: సికింద్రాబాద్‌, నాంప‌ల్లిల మీదుగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సులు

  • By: sr    latest    Feb 16, 2025 1:41 PM IST
Airport Pushpak: సికింద్రాబాద్‌, నాంప‌ల్లిల మీదుగా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ బస్సులు

Airport Pushpak:

విధాత‌: శంషాబాద్ రాజీవ్ గాందీ ఎయిర్‌పోర్ట్ (RGI) కు వెళ్లాల‌నుకకునే ప్ర‌యాణికుల‌కు తెలంగాణ ఆర్టీసీ ఓ శుభ‌వార్త తెలిపింది. ప్ర‌స్తుతం జూబ్లీ బ‌స్ స్టేష‌న్ (JBS) నుంచి ఏల్బీన‌గ‌ర్ మీదుగా ఎయిర్‌పోర్టుకు పుష్ప‌క్ ఏసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. కొత్త‌గా ఇప్పుడు జూబ్లీ స్టేష‌న్ నుంచి సిటీలోని కీల‌క ప్రాంతాలైన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌, రాణిగంజ్‌, సచివాలయం, రవీంద్రభారతి, హజ్‌ హౌస్‌, నాంపల్లి, గాంధీభవన్‌, ఎంజే మార్కెట్‌, అఫ్జల్‌గంజ్‌, బహుదూర్‌పురా, ఆరంఘర్‌, శంషాబాద్‌ల మీదుగా ఎయిర్‌పోర్టుకు బ‌స్సులు న‌డుప‌నున్నారు.

ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌మావేశంలో గ్రేటర్‌ ఆర్టీసీ ఇన్‌చార్జి ఈడీ రాజశేఖర్ మాట్లాడుతూ.. శంషాబాద్‌ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ , జూబిలీ బస్ స్టేషన్ (JBS) నుంచి రాజీవ్‌గాంధీ ఎయిర్‌పోర్ట్‌(RGI)కు మొదటిసారిగా 6 పుష్పక్‌ ఏసీ సర్వీసు బస్సులను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.

జేబీఎస్ (JBS) నుంచి మొదటి బస్సు అర్థరాత్రి 12.55, చివరి బస్సు రాత్రి 11.55 వరకు.. తెల్ల‌వారుజాము 3 గంట‌ల త‌ర్వాత నుంచి ప్ర‌తి గంట‌కో బ‌స్సు నడుపుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ (RGI) నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు అర్థరాత్రి 12.50 నుంచి రాత్రి 11.50 వరకు 24 గంట‌లు ప్ర‌తి గంట‌ల‌కో బ‌స్సు న‌డుప‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇదిలాఉండ‌గా ఈ బ‌స్సులో టికెట్ ధ‌ర రూ.250 నుంచి మొద‌ల‌వ‌నుండ‌గా వాటికి కొన్ని ప్ర‌యోజ‌నాలు సైతం అర్టీసీ క‌ల్పించింది. ఈ టికెట్ 24 గంట‌లు వ్యాలిడిటీ ఉండ‌డంతో పాటు న‌గ‌రంలోని అన్ని సిటీ బ‌స్సుల‌లో ఉచితంగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. ఫ్రెడ్స్ గానీ కుటుంబ స‌భ్యులు గ్రూపులుగా ఎయిర్‌పోర్టుకు, అక్క‌డి నుంచి నుంచి త‌మ ఇండ్ల‌కు వెళ్లాల‌నుకునే వారికి టిక్కెట్ ధ‌ర‌ల‌పై 10 నుంచి 20 శాతం వ‌ర‌కు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు.

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌(RGI)కు బ‌స్సు స‌మ‌యాలు

0:55, 3:15, 4:15, 5:15, 6:15,
7:55, 8:55, 9:55, 10:45, 11:45,
12:45, 13:45, 14: 25, 15:25, 16:25,
17:25, 18:15, 19:15, 20:15,
21:15, 21:55, 22:55, 23:55.

ఎయిర్‌ పోర్ట్‌ (RGI) నుంచి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు బ‌స్సు స‌మ‌యాలు

0:50, 1:50, 2:50, 5:10, 6:10,
7:10, 8:10, 8:50, 9:50, 10:50,
11:50, 12:40, 1:40, 14:40, 15:40,
16:20, 17:20, 18:20, 19:20,
20:10, 21:10, 22:10, 23:10, 23:50