NTPC: తెలంగాణకు NTPC వెలుగులు సిద్ధం
చివరి దశలో తెలంగాణ ప్రాజెక్ట్ పనుల పురోగతి పర్యవేక్షించిన అధికారులు విధాత, కరీంనగర్ బ్యూరో: విధాత, కరీంనగర్ బ్యూరో: రామగుండం(Ramagundm)లో నిర్మిస్తున్న తెలంగాణ స్టేట్ థర్మల్ ప్లాంట్(Telangana State Thermal Plant)విద్యుత్ వెలుగులు విరజిమ్మడానికి సిద్ధమవుతోంది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం రామగుండంలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్(Thermal Power Plant) నిర్మించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ(NTPC)కి అప్పగించింది. ఇందులో తొలి దశ కింద 16 మెగావాట్లతో కూడిన 2 […]

- చివరి దశలో తెలంగాణ ప్రాజెక్ట్
- పనుల పురోగతి పర్యవేక్షించిన అధికారులు
విధాత, కరీంనగర్ బ్యూరో: విధాత, కరీంనగర్ బ్యూరో: రామగుండం(Ramagundm)లో నిర్మిస్తున్న తెలంగాణ స్టేట్ థర్మల్ ప్లాంట్(Telangana State Thermal Plant)విద్యుత్ వెలుగులు విరజిమ్మడానికి సిద్ధమవుతోంది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణ విద్యుత్ అవసరాల కోసం రామగుండంలో 4వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్(Thermal Power Plant) నిర్మించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ(NTPC)కి అప్పగించింది. ఇందులో తొలి దశ కింద 16 మెగావాట్లతో కూడిన 2 యూనిట్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్(Green signal) ఇచ్చింది. దీంతో అనేక అవాంతరాలు, సవాళ్లను అధిగమించిన ఎన్టీపిసి(NTPC) తెలంగాణ విద్యుత్ ప్రాజెక్టు(Power Project)ను అందుబాటులోకి తెచ్చేందుకు సన్నాహాలు పూర్తి చేసింది.
చివరి దశకు రెండు విద్యుత్ యూనిట్ల నిర్మాణ పనులు
రామగుండం ఎన్టీపిసి వద్ద మొదటి దశలో 800 మెగావాట్లకు చెందిన రెండు సూపర్ క్రిటికల్ విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులు చేపట్టగా, ప్రస్తుతం ఈ రెండు విద్యుత్ యూనిట్ల నిర్మాణం పనులు చివరి దశకు చేరుకున్నాయి. 800 మెగావాట్లతో కూడిన మొదటి యూనిట్ ను మరో వారం రోజుల్లో లైట్ ఆఫ్ చేసి ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇదే క్రమంలో రెండవ యూనిట్ ను
ఐదు నెలల కాలవ్యవధిలోగా ఉత్పత్తిలోకి తీసుకువచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు కోసం సింగరేణి నుండి ఒప్పందం కుదుర్చుకుని తొలి సారి 40 వేల టన్నుల బొగ్గును దిగుమతి చేసుకున్నారు.
బొగ్గు సరఫరాకు రైల్వే లైన్ పూర్తి..
16వందల మెగావాట్ల విద్యుత్ యూనిట్లకు సంబంధించి ఎన్టీపిసి జలాశయం సమీపంలో 200 ఎకరాల్లో బూడిద నిల్వ కేంద్రాన్ని సిద్ధం చేశారు. ప్రాజెక్టు ఆవరణలో 8 లక్షల టన్నుల బొగ్గు నిల్వ చేయడానికి అవసరమైన వసతులు కల్పించారు. బొగ్గు సరఫరాకు సంబంధించి రైల్వే లైన్(Railway Line) ఇప్పటికే పూర్తి చేశారు. ఇటీవలే ఒక రేక్ బొగ్గులు విజయవంతంగా ప్లాంట్‌కు తరలించారు. మొదటి యూనిట్ కమర్షియల్ ఆపరేషన్ పనులు ప్రారంభం కాగానే, రెండవ యూనిట్ పై దృష్టి సారించనున్న అధికారులు
ఐదు నెలల వ్యవధిలోగా దీనిని ఉత్పత్తి దశలోకి తీసుకురానున్నారు.
పనుల పురోగతి పరిశీలించిన ప్రాజెక్టు డైరెక్టర్
రామగుండం ఎన్టీపిసి వద్ద నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ ప్రాజెక్ట్ మొదటి దశకు చెందిన 1600 మెగావాట్ల.1,2 యూనిట్ల నిర్మాణం పనులను డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఉజ్వల్ క్రాంతి భట్టాచార్య(Ujjwal Kranti Bhattacharya)పర్యవేక్షించారు. మంగళవారం ఉదయం ఇక్కడికి చేరుకున్న ఆయన తెలంగాణ ప్రాజెక్టుకు చెందిన మొదటి (800 మెగావాట్లు) దశ లోని టర్బెన్ జనరేటర్ కంట్రోల్ రూమ్ స్విచ్ యార్డ్ లను పరిశీలించారు. రెండవ యూనిట్లో జరుగుతున్న నిర్మాణం పనులను అడిగి తెలుసుకున్నారు. రెండు విద్యుత్ యూనిట్లకు చెందిన కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ బొగ్గు రవాణా విధానాన్ని, యాష్ హ్యాండ్లింగ్ ప్లాంట్ లను పరిశీలించారు.
అనంతరం తెలంగాణ ప్రాజెక్టుకు చెందిన పలు విభాగాల ఉన్నతాధికారులతో పాటు నిర్మాణం పనులు చేపట్టిన కంపెనీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) ఉజ్వల్ కాంతి భట్టాచార్య, ఆర్ అది దేబాసిష్ చటోపాధ్యాయ, ఈడి సునీల్ కుమార్ తదితరులు పర్యవేక్షణలో పాల్గొన్నారు.