NTPC | ఎన్‌టీపీసీలో 150 డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా..!
NTPC | బీటెక్( BTech ) పాసైన వారికి ఇదో గొప్ప అవకాశం. ఎన్‌టీపీసీ( NTPC )లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. ఎన్‌టీపీసీలో 150 డిప్యూటీ మేనేజర్( Deputy Manager ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్( Job Notification ) వెలువడింది.
NTPC | బీటెక్( BTech ) పాసైన వారికి ఇదో గొప్ప అవకాశం. ఎన్‌టీపీసీ( NTPC )లో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది శుభవార్త. ఎన్‌టీపీసీలో 150 డిప్యూటీ మేనేజర్( Deputy Manager ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్( Job Notification ) వెలువడింది. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు వివరాలు తెలుసుకుందాం..
పోస్టులు ఇలా..
డిప్యూటీ మేనేజర్(డీఎం) ఎలక్ట్రికల్ – 40
డిప్యూటీ మేనేజర్ మెకానికల్ – 70
కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ – 40
రిజర్వేషన్ల వారీగా ఖాళీలు ఇలా..
అన్ రిజర్వ్‌డ్ – 68
ఈడబ్ల్యూఎస్ – 13
ఓబీసీ – 38
ఎస్సీ – 20
ఎస్టీ – 11
అర్హతలు..
ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్/ మెకానికల్ /ప్రొడక్షన్ /కంట్రోల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచ్‌తో బీఈ /బీటెక్ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి.
కోల్, గ్యాస్, లిగ్నైట్ రంగాల్లో ఎగ్జిక్యూటివ్‌గా పదేళ్ల అనుభవం ఉండాలి.
ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే వారు పేస్లిప్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్‌లను, ప్రయివేటు సంస్థల్లో పని చేస్తున్న వారు గత మూడేండ్ల ఫామ్ 16లను సమర్పించాలి.
వయసు : 40 ఏండ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, దివ్యాంగులకు పదేండ్ల వయసు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు రూ. 300, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, మహిళలకు ఫీజు లేదు.
వేతన శ్రేణి : నెలకు రూ. 70 వేల నుంచి రూ. 2 లక్షల వరకు.
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : జూన్ 9, 2025
ఆన్‌లైన్ దరఖాస్తుతో పాటు తదితర వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి.. https://careers.ntpc.co.in/recruitment/
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram