Site icon vidhaatha

NTR Fan Suicide | NTR అభిమాని ఆత్మహత్య.. TDP, YCP మధ్య పొలిటికల్ వార్!

NTR Fan Suicide |

విధాత‌: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి ముదురుతున్న తరుణంలో రాష్ట్రంలో జరిగే ప్రతి అంశమూ రాజకీయ అంశంగా మారుతోంది. తాజాగా జూనియర్ ఎన్టీయార్ అభిమాని ఆత్మహత్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి వైసీపీల మధ్య రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు ప్రధాన అంశంగా మారింది.

తూర్పుగోదావరి జిల్లా కొప్పిగుంట గ్రామానికి చెందిన ఇరవైమూడేళ్ల శ్యామ్ రెండ్రోజుల క్రిందట చింతలూరు గ్రామానికి వెళ్లి అక్కడే ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఇది వైసిపి నాయకుల బలవంతాన, బెదిరింపు కారణంగా జరిగిన హత్య అని టిడిపి వాళ్ళు ఆందోళన చేస్తున్నారు.

ఈ ఘటన మీద ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ ఆ ఆత్మహత్య మీద విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్యామ్ మరణానికి సంతాపం ప్రకటించారు. ఇక జూనియర్ అభిమానులు ఐతే శ్యామ్ కుటుంబానికి బాసటగా ఉంటాం అని ప్రకటిస్తున్నారు.

ఇక శ్యామ్ అనుమానాస్పద మృతిపై విచారణ జరిపించాలని, ఇందులో వైసీపీ నాయకుల హస్తం ఉందన్నట్లుగా వార్తలు వస్తున్నాయని.. శ్యామ్ కోసం తాము పోరాడతామని చంద్రబాబు లోకేష్ లు ట్విట్టర్లో పేర్కొన్నారు. దీంతో ఈ ఘటన మొత్తం రాజకీయం అయిపొయింది.

దీనికి వైసిపి సైతం స్పందిస్తూ అధికారక ట్విట్టర్ అకౌంట్ లో “శ్యామ్ ఆత్మకి శాంతి చేకూరాలి ఈ విషాధ సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి స్నేహితులకి శ్యామ్ తోటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరికి మా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం” అని పేర్కొంది.

ఇదే సమయంలో శ్యామ్ కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని వైసీపీ హామీ ఇచ్చింది. అనంతరం… ఈ ఘటన ని రాజకీయంగా వాడుకోవాలని చంద్రబాబు లోకేష్ లాంటి నీచ రాజకీయ నాయకులు ప్రయత్నించారని.. ఇది చాలా బాధాకరం అని పార్టీ పేర్కొంది. ఇదిలా ఉండగా శ్యామ్ ఆత్మ హత్యకు ముందు రికార్డ్ చేసినట్లుగా చెబుతున్న వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

తనకు ఉద్యోగం చేసే ఇంటరెస్ట్ లేదని.. జీవించడం ఇబ్బందిగా ఉందని చెబుతూ అమ్మకు నాన్నకు క్షమాపణలు కోరుతూ శ్యామ్ రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. మొత్తానికి ఈ మరణం రాజకీయ పార్టీలకు ఒక చర్చా వస్తువుగా మారిపోయింది.

“అమ్మా నాన్న నన్ను క్షమించండి. నేను అందరి దృష్టిలో వేస్ట్. నేను ఉన్నా మీకు ఉపయోగం లేదు. నాకు జాబ్ చేయాలనే ఇంట్రస్ట్ లేదు. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. వచ్చే జన్మంటూ ఉంటే మీ కడుపునే పుడతాను” అని శ్యామ్ మాట్లాడుతున్నటుగా ఉంది.

Exit mobile version