అందుకు.. ఒత్తిడి చేసిందని.. ప్రియురాలిపై 49 కత్తిపోట్లు!
Lover Stabs | ఓ అమ్మాయి తన ప్రియుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. పెళ్లి చేసుకుందామని అడిగింది. కానీ ప్రియుడు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇటీవల అతనిపై ఒత్తిడి తీసుకొచ్చే వరకు, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. 49 సార్లు కత్తితో దాడి చేసి చంపాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన జగన్నాథ్ గోడా […]

Lover Stabs | ఓ అమ్మాయి తన ప్రియుడిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది. పెళ్లి చేసుకుందామని అడిగింది. కానీ ప్రియుడు మాత్రం ఒప్పుకోవడం లేదు. ఇటీవల అతనిపై ఒత్తిడి తీసుకొచ్చే వరకు, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రియురాలిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. 49 సార్లు కత్తితో దాడి చేసి చంపాడు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చెందిన జగన్నాథ్ గోడా అనే యువకుడిని కునిదార్ సీమదాస్ అనే అమ్మాయి గత కొన్నేండ్ల నుంచి ప్రేమిస్తోంది. పెళ్లి చేసుకుంటానని కూడా జగన్నాథ్ కునిదార్‌కు హామీ ఇచ్చాడు. ఈ క్రమంలో తనను పెళ్లి చేసుకోవాలని అతనిపై ప్రియురాలు ఒత్తిడి తీసుకొచ్చింది. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేక కాలయాపన చేస్తున్నాడు గోడా. అతనికి పెళ్లి చేసుకోవడం లేదని భావించిన కునిదార్ ప్రియుడిపై మరింత ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
ఇక గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్దామని చెప్పాడు కునిదార్‌కు. అక్కడ పర్యటిద్దామని చెప్పడంతో.. ఇద్దరూ కలిసి సూరత్ వెళ్లారు. సూరత్‌లో ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో ఆమెపై దాడి చేశాడు. 49 సార్లు కత్తితో పొడిచి చంపాడు. అనంతరం గోడా భువనేశ్వర్‌కు తిరిగి వచ్చాడు.
నిందితుడిని పట్టించిన టీ షర్ట్
అయితే యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి సూరత్ పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె ధరించిన టీ షర్ట్ విచారణలో కీలకమైంది. ఆ టీ షర్ట్ ఆధారంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్‌లో నమోదైన ఫుటేజీలను పరిశీలించగా, జగన్నాథ్, కునిదార్ కలిసి తిరిగిన ఫుటేజీలు లభించాయి. దీంతో నిందితుడిని భువనేశ్వర్‌లో అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్‌కు తరలించారు.