Pashupathi Temple | నేపాల్ పశుపతి ఆలయంలో 10 కిలోల బంగారం మాయం..
Pashupathi Temple | నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయంలో బంగారం మాయమైంది. సుమారు 100 కిలోల బంగారు ఆభరణాలు ఉండాల్సి ఉండగా, అందులో 10 కిలోల బంగారం మాయం కావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పశుపతి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో కొన్ని గంటల పాటు దర్శనాలను నిలిపివేశారు. గతేడాది మహాశివరాత్రి సమయంలో ఆలయంలోని శివలింగం చుట్టూ బంగారంతో కూడిన జలహరిని ఏర్పాటు […]
Pashupathi Temple | నేపాల్‌లోని ప్రముఖ పశుపతినాథ్ ఆలయంలో బంగారం మాయమైంది. సుమారు 100 కిలోల బంగారు ఆభరణాలు ఉండాల్సి ఉండగా, అందులో 10 కిలోల బంగారం మాయం కావడం చర్చనీయాంశమైంది. ఈ క్రమంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. పశుపతి ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు నిర్వహించారు. సోదాల నేపథ్యంలో కొన్ని గంటల పాటు దర్శనాలను నిలిపివేశారు.
గతేడాది మహాశివరాత్రి సమయంలో ఆలయంలోని శివలింగం చుట్టూ బంగారంతో కూడిన జలహరిని ఏర్పాటు చేశారు. అయితే దీని ఏర్పాటు కోసం పశుపతి ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ 103 కిలోల బంగారాన్ని కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన ఆభరణాల్లో 10 కిలోల బంగారం మాయమైనట్లు వార్తలు వచ్చాయి.
ఈ బంగారం మాయంపై నేపాల్ పార్లమెంట్‌లోనూ తీవ్ర చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో విచారణ జరపాలని అవినీతి నిరోధక శాఖను నేపాల్ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో అవినీతి నిరోధక శాఖ అధికారులు.. ఆలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram