Tirumala| తిరుమల శ్రీవారికి భారీ కానుకలు

తిరుమల శ్రీవారికి భక్తులు భారీ కానుకలు సమర్పించుకున్నారు. రూ.1.80 కోట్ల విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి బహూకరించారు.

Tirumala| తిరుమల శ్రీవారికి భారీ కానుకలు

విధాత : తిరుమల శ్రీవారికి భక్తులు భారీ కానుకలు సమర్పించుకున్నారు. రూ.1.80 కోట్ల విలువైన 15 బంగారు పతకాలు, రెండు వెండి తట్టలను శ్రీవారికి బహూకరించారు. శ్రీ సంస్థాన్ గోకర్ణ పర్తగాళి జీవోత్తమ మఠం మఠాధిపతి శ్రీమద్ విద్యాదీశ తీర్థ స్వామీజీ శ్రీవారికి ఈ కానుకలు సమర్పించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఆలయ అధికారులకు కానుకలు అందజేశారు.

ప్రస్తుతం తిరుమలలో బ్రహ్మోత్సవాల సందడి కొనసాగుతున్న క్రమంలో స్వామివారికి విలువైన కానుకలు అందడం విశేషం. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ నెల 23నుంచి ప్రారంభంకానున్నాయి. 9 రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలలో స్వామివారు ఒక్కోరోజు ఒక్కో వాహనంపై విహరించనున్నారు. 27న గరుడసేవ నిర్వహించనున్నారు.