Pythons | ఎయిర్‌పోర్టులో 47 కొండ‌చిలువలు, 2 బ‌ల్లులు సీజ్..

Pythons | ఒక దేశం నుంచి మ‌రో దేశానికి బంగారు ఆభ‌ర‌ణాలు, మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స్మ‌గ్లింగ్ చేయ‌డం చూశాం. కానీ ఓ వ్య‌క్తి మాత్రం ఇవేమీ కాకుండా.. స‌రీసృపాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించాడు. త‌మిళ‌నాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కొండ‌చిలువ‌లు, బ‌ల్లుల‌తో ఓ వ్య‌క్తి ప‌ట్టుబ‌డ్డాడు. వివ‌రాల్లోకి వెళ్తే.. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఆదివారం మ‌హ‌మ్మ‌ద్ మొయినుద్దీన్ అనే ప్ర‌యాణికుడు తిరుచ్చి అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యానికి చేరుకున్నాడు. అయితే అత‌ను అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో.. క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు. మొయినుద్దీన్ వ‌ద్ద ఉన్న […]

Pythons | ఎయిర్‌పోర్టులో 47 కొండ‌చిలువలు, 2 బ‌ల్లులు సీజ్..

Pythons | ఒక దేశం నుంచి మ‌రో దేశానికి బంగారు ఆభ‌ర‌ణాలు, మాద‌క‌ద్ర‌వ్యాల‌ను స్మ‌గ్లింగ్ చేయ‌డం చూశాం. కానీ ఓ వ్య‌క్తి మాత్రం ఇవేమీ కాకుండా.. స‌రీసృపాల‌ను అక్ర‌మంగా త‌ర‌లించాడు. త‌మిళ‌నాడులోని తిరుచ్చి ఎయిర్‌పోర్టులో కొండ‌చిలువ‌లు, బ‌ల్లుల‌తో ఓ వ్య‌క్తి ప‌ట్టుబ‌డ్డాడు.

వివ‌రాల్లోకి వెళ్తే.. మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి ఆదివారం మ‌హ‌మ్మ‌ద్ మొయినుద్దీన్ అనే ప్ర‌యాణికుడు తిరుచ్చి అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యానికి చేరుకున్నాడు. అయితే అత‌ను అనుమానాస్ప‌దంగా క‌నిపించ‌డంతో.. క‌స్ట‌మ్స్ అధికారులు త‌నిఖీలు నిర్వ‌హించారు.

మొయినుద్దీన్ వ‌ద్ద ఉన్న బ్యాగులో 47 కొండ చిలువ‌లు, రెండు బ‌ల్లుల‌ను చూసి అధికారులు షాక్ అయ్యారు. వెంట‌నే అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం. ప‌లు జాతుల‌కు చెందిన కొండ‌చిలువ‌ల‌ను తిరిగి మ‌లేషియా పంపేందుకు అట‌వీశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ‌చిలువ‌ల‌ను అక్ర‌మంగా త‌ర‌లించిన మొయినుద్దీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.