Pathaan: షారుఖ్, దీపికలకు ప్రకాశ్‌రాజ్ సపోర్ట్

విధాత: మన దేశంలోని మేధావులు తీరు ఏమిటంటే కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పి గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు ఆ పని చేసినప్పుడు మీరు ఖండించలేదు కదా ఇప్పుడు మేమెందుకు కండిస్తాం.. ఇప్పుడు జరిగింది నాటి ఘటన కంటే పెద్దది కాదు కదా అంటూ సూక్తులు చెప్తాం కానీ ప్రభుత్వం ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని ఖండించి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలను నిలదీయడం మాత్రం మనకు చేతకాదు. ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే […]

  • By: krs    latest    Dec 19, 2022 8:30 AM IST
Pathaan: షారుఖ్, దీపికలకు ప్రకాశ్‌రాజ్ సపోర్ట్

విధాత: మన దేశంలోని మేధావులు తీరు ఏమిటంటే కోడి ముందా గుడ్డు ముందా అని చెప్పి గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు ఆ పని చేసినప్పుడు మీరు ఖండించలేదు కదా ఇప్పుడు మేమెందుకు కండిస్తాం.. ఇప్పుడు జరిగింది నాటి ఘటన కంటే పెద్దది కాదు కదా అంటూ సూక్తులు చెప్తాం కానీ ప్రభుత్వం ఏదైనా అన్యాయం జరిగితే దాన్ని ఖండించి అలాంటివి పునరావృతం కాకుండా ప్రభుత్వాలను నిలదీయడం మాత్రం మనకు చేతకాదు.

ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే చాలు కాషాయీకరణ అంటూ మన కొహరం మేధావులు నానా హంగామా చేస్తారు. వారి ప్రభుత్వాలలో అసలు నేరాలు జరగనట్టు.. అంతా సవ్యంగా ఉన్నట్టు బిజెపి వస్తేనే మతాలు గొడవలు వస్తాయి అనేట్లుగా బిహేవ్ చేస్తారు కానీ.. వాస్తవానికి చూస్తే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. ఇలాంటివి మాములే. టెక్నాలజీ పెరిగే కొద్ది మరింతగా ఇలాంటివి పెరిగిపోతున్నాయి.

ఇక విషయానికొస్తే.. ఊరందరిదీ ఒకదారైతే ఉలిపిరి కట్టది మరోదారి అన్నట్లుంది విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ వ్యవహరం. తరుచూ బీజేపీని తూర్పార పట్టే ఆయన ఆది నుంచి బీజేపీ విధానాలకు, మతతత్వ రాజకీయాలకు వ్యతిరేకం. తాజాగా షారుక్ నటించిన పఠాన్ మూవీ విషయంలో నెలకొన్న వివాదంపై ప్రకాశ్ రాజ్ ఘాటుగా స్పందించాడు. దీపికా పడుకొనేకు మద్దతుగా నిలిచాడు.

పఠాన్‌లోని సాంగ్‌లో దీపిక కాషాయ వస్త్రం ధరించిందంటూ.. వివాదం నెలకొనగా ఇండోర్‌లో ఇటీవలే నిరసనకారులు ఈ సినిమా హీరో షారుక్ ఖాన్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. దీనిపై ఆయన స్పందించాడు. ఈ పాట మొత్తంలో దీపిక ధరించిన ఆఫ్ బికినీ డ్రెస్‌లతో పాటు ఆమె చేసిన మూమెంట్స్ కొన్ని బోల్డ్‌గా ఉన్నాయనేది అందరి వాదన. ఈ వివాదం పఠాన్ మూవీని బ్యాన్ చేయాలనేంత దూరం వెళ్ళింది.

దీనికి విరుద్ధంగా ప్రకాష్ రాజ్ మాట్లాడాడు.. కాషాయం ధరించి రేపు సత్కరిస్తే, ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తే పర్వాలేదు.. బ్రోకర్ ఎమ్మెల్యేలు కాషాయ స్వామి మైనర్లపై అత్యాచారం చేసినా పట్టదు కానీ.. ఒక సినిమాలో బోల్డ్ డ్రెస్ ధరించ కూడదా అంటూ ఇక్కడ ప్రకాష్ చెప్పిన పాయింట్ సమన్వయమే. కానీ మనం దొంగ స్వామీజీలు, కామ పిశాచాలైన ఎమ్మెల్యేలు ఇలాంటి వారందరినీ ఎండ కడుతూనే దీపిక పాటను కూడా ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రకాశ్ రాజ్ తెలుసుకోవాలి.

అంతకుముందే మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా సైతం ఈ చిత్రంలో దీపిక వేషధారణపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. పఠాన్ చిత్రంలోని పాటను డర్టీ మైండ్ సెట్‌తో చిత్రీకరించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సరైన పద్ధతి కాదని భావిస్తున్నానని, వెంటనే తొలగించాలని మేకర్స్‌కు హెచ్చరికలు జారీ చేశాడు.

ఇక ఈ పాటలో దీపిక కాషాయ దుస్తులు ధరించడం కూడా పెద్ద వివాదం అయింది. గతంలో ఇండియన్ క్రికెట్ కాషాయాన్ని పోలిన జెర్సీని ధరించినప్పుడు కూడా ఇదే గొడవ. ఇలాంటి వాటితో సమస్యలు పరిష్కారం కావు. రెండు వైపులా తప్పు ఒప్పులను ఎత్తిచూపుతూ.. రెండు పాశ్వాలను ఒక నాణ్యానికి ఉన్న రెండు కోణాలను కూడా చూసినప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.