Pawan Kalyan | అంద‌రి ముందే సొంత మేన‌ల్లుడిపై చిరాకు ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇంత‌కు ఏం చేశాడు..!

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందిన బ్రో జూలై 28న విడుద‌ల కానుండగా, ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైద‌రాబాద్‌లోని శిల్ప‌కళా వేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. వ‌రుణ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్ కూడా ఈవెంట్‌లో మెరిసి సంద‌డి చేశారు. అయితే అంద‌రు మాట్లాడిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ […]

  • By: sn    latest    Jul 26, 2023 5:15 AM IST
Pawan Kalyan | అంద‌రి ముందే సొంత మేన‌ల్లుడిపై చిరాకు ప‌డ్డ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. ఇంత‌కు ఏం చేశాడు..!

Pawan Kalyan:

ప‌వ‌న్ క‌ళ్యాణ్, సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌ధాన పాత్ర‌లలో రూపొందిన బ్రో జూలై 28న విడుద‌ల కానుండగా, ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని హైద‌రాబాద్‌లోని శిల్ప‌కళా వేదిక‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు.

కార్య‌క్ర‌మానికి పెద్ద ఎత్తున అభిమానుల‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు కూడా హాజ‌ర‌య్యారు. వ‌రుణ్ తేజ్, వైష్ణ‌వ్ తేజ్ కూడా ఈవెంట్‌లో మెరిసి సంద‌డి చేశారు. అయితే అంద‌రు మాట్లాడిన త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుధీర్ఘ స్పీచ్ ఇచ్చారు. ఎప్పుడు లేని విధంగా ఆయ‌న ఒక చిట్టీ రాసుకొచ్చి మరీ సినిమాలో ప‌ని చేసిన ప్ర‌తి ఒక్క‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశాడు.

సాధార‌ణంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ కి త‌న సినిమా కోసం పని చేసిన టెక్నీషియ‌న్స్ పేర్లు పెద్ద‌గా గుర్తుండ‌వు. ప‌క్క‌న ఉన్న వాళ్ల‌ని అడిగి వారి పేరు చెబుతూ ఉంటాడు. త‌న సినిమా వ‌కీల్ సాబ్‌కి తమ‌న్ సంగీతం అందించగా, స్టేజ్ మీద‌నే నువ్వేనా నేను చేసిన వ‌కీల్ సాబ్ సినిమాకి సంగీతం అందించింద‌ని అన్నాడు.

మణిశర్మ దగ్గర పని చేసినప్పటి నుంచి త‌మ‌న్ త‌న‌కి తెలుసని వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు కూడా సంగీతాన్ని ఇచ్చాడ‌ని, ఇప్పుడు ఇది హ్యాట్రిక్ కానుందని అన్నాడు. ఆ త‌ర్వాత హీరోయిన్లు, నటీనటులు అందరి పేర్లు చెప్పాడు. అందరికీ థాంక్స్ అని అన్నారు ప‌వ‌న్.

ఇక ప‌వ‌న్ ప్ర‌సంగంలో సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తావ‌న కూడా వ‌చ్చింది. ఆయ‌న యాక్సిడెంట్‌, అత‌నిని కాపాడిన వ్య‌క్తి, ఆసుప‌త్రి వివ‌రాల గురించి కొద్ది సేపు మాట్లాడాడు. ఇక చిత్రంతో తేజ్ న‌టించ‌డానికి ప్ర‌ధాన కార‌ణం త్రివిక్ర‌మ్ అన్నారు. నేను ఏ హీరో అయిన ప‌ర్వాలేదు అంటే త్రివిక్ర‌మ్.. తేజ్ అయితేనే బాగుంటుంద‌ని అత‌నిని తీసుకొచ్చార‌ని చెప్పుకొచ్చారు.

అలా ప‌వ‌న్ ప్ర‌సంగం కొన‌సాగిస్తుంటే .. వైష్ణవ్ తేజ్ వెనక నుంచి నిర్మాతల గురించి చెప్పండని అన్నట్టు సిగ్న‌ల్ ఇచ్చాడు. అప్పుడు వెంటనే వెనక్కి తిరిగిన పవన్ కళ్యాణ్ కాస్త అసహనం వ్యక్తం ఏస్తూ.. నాకు తెలుసురా.. నేను మరిచిపోను.. అస‌లు నిర్మాతల గురించి ఎలా మరిచిపోతాను.. ఈ సినిమాను ఇంత ఫాస్ట్‌గా తీయడానికి కారణం విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల గారే కారణం అంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.