Pawan Kalyan:వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన షూ ధ‌ర తెలిస్తే దిమ్మ తిరిగిపోవ‌డం ఖాయం..!

Pawan Kalyan: ఈ మ‌ధ్య కాలంలో సినీ ప్రియులు సెల‌బ్రిటీలు వాడే వ‌స్తువుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. వారు ఏ కార్‌లో తిరుగుతున్నారు, ఎలాంటి బ‌ట్ట‌ల వేసుకుంటున్నారు, వాడు వాడే స్ప్రే ఏంటి, గాడ్జెట్స్, ప్రాపర్టీస్ వాల్యూ ఏంటి ఇలా వారికి సంబంధించిన ప‌లు విష‌యాల‌పై తెగ శోధ‌న చేస్తున్నారు. మొన్నామ‌ధ్య ఉపాస‌న డెలివ‌రీ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ ఓ కాస్ట్ లీ వాచ్ ధరించ‌గా, దాని గురించి తెగ వెతికేసారు. అంతేకాదు దాని ధ‌ర తెలుసుకొని […]

  • By: sn    latest    Jul 03, 2023 1:32 AM IST
Pawan Kalyan:వామ్మో.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన షూ ధ‌ర తెలిస్తే దిమ్మ తిరిగిపోవ‌డం ఖాయం..!

Pawan Kalyan: ఈ మ‌ధ్య కాలంలో సినీ ప్రియులు సెల‌బ్రిటీలు వాడే వ‌స్తువుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారిస్తున్నారు. వారు ఏ కార్‌లో తిరుగుతున్నారు, ఎలాంటి బ‌ట్ట‌ల వేసుకుంటున్నారు, వాడు వాడే స్ప్రే ఏంటి, గాడ్జెట్స్, ప్రాపర్టీస్ వాల్యూ ఏంటి ఇలా వారికి సంబంధించిన ప‌లు విష‌యాల‌పై తెగ శోధ‌న చేస్తున్నారు. మొన్నామ‌ధ్య ఉపాస‌న డెలివ‌రీ స‌మ‌యంలో రామ్ చ‌ర‌ణ్ ఓ కాస్ట్ లీ వాచ్ ధరించ‌గా, దాని గురించి తెగ వెతికేసారు. అంతేకాదు దాని ధ‌ర తెలుసుకొని నోరెళ్ల‌పెట్టారు. ఇక ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ బ్రో సినిమా కోసం ధ‌రించిన షూ రేటు తెలుసుకొని అవాక్క‌వుతున్నారు.

పవన్ కళ్యాణ్,సాయి ధరమ్ తేజ్ కలిసి స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో బ్రో అనే సినిమా చేస్తుండ‌గా, ఈ చిత్రం జూలై 28న విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే చిత్రానికి సంబంధించి విడుద‌లైన పోస్ట‌ర్, టీజ‌ర్ సినిమాపై భారీ అంచ‌నాలు పెంచాయి. రీసెంట్ గా విడుద‌లైన టీజ‌ర్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయి ధ‌ర‌మ్ తేజ్ లుక్స్ మెగా అభిమానుల‌కి మాంచి కిక్ ఇచ్చాయి. అయితే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్‌లో ప‌వ‌న్‌ గెటప్ చూసి, అందులో ఆయన వేసుకున్న షూస్ గురించి ఇప్పుడు నెట్టింట తెగ చ‌ర్చ న‌డుస్తుంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధరించిన షూస్ బాలెన్సియాగా బ్రాండ్‌కి చెందిన డిఫెండర్ బ్లాక్ స్నీకర్స్ అని తెలుస్తుంది. ఈ షూస్ ధ‌ర అక్ష‌రాలా.. రూ.88,732/-. ఇవి చూడ్డానికి స్టైల్‌గా కనిపించడమే కాక కంఫర్ట్‌బుల్‌గానూ ఉంటాయ‌ని అంటున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ధ‌రించిన త‌ర్వాత ఈ షూస్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాయి. అంతేకాదు ప్ర‌తి ఒక్క‌రు కూడా ఈ షూస్ కొనుక్కునేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్టు తెలుస్తుంది. కాగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ గ‌తంలో ధ‌రించిన హుడీ, వాచ్, షూస్, కార్లు వంటివి హాట్ టాపిక్‌గా మార‌డం మ‌నం చూశాం. ఇప్పుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల‌తో పాటు రాజ‌కీయాల‌తో బిజీగా ఉన్నారు.