Supreme Court | INDIA.. పేరు వాడకంపై పిటిషన్‌ కొట్టివేత.. పిల్‌ వేయడానికి మీరెవరు: సుప్రీం

Supreme Court ఉపసంహరించుకున్న న్యాయవాది న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలు తమ ఇండియన్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇంక్లూసివ్‌ అలయెన్స్‌ కూటమికి ఐఎన్‌డీఐఏ అనే సంక్షిప్త పదబంధాన్ని వాడకుండా నిరోధించాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది. ఈ పిటిషన్‌ వేయడానికి మీరు ఎవరు? ఇది పూర్తిగా పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌లా ఉన్నది’ అని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఈ పిటిషన్‌ను ధావన్‌ ఉనియాల్‌ అనే న్యాయవాది […]

Supreme Court | INDIA.. పేరు వాడకంపై పిటిషన్‌ కొట్టివేత.. పిల్‌ వేయడానికి మీరెవరు: సుప్రీం

Supreme Court

  • ఉపసంహరించుకున్న న్యాయవాది

న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీలు తమ ఇండియన్‌ నేషనల్‌ డెమోక్రటిక్‌ ఇంక్లూసివ్‌ అలయెన్స్‌ కూటమికి ఐఎన్‌డీఐఏ అనే సంక్షిప్త పదబంధాన్ని వాడకుండా నిరోధించాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం నిరాకరించింది.

ఈ పిటిషన్‌ వేయడానికి మీరు ఎవరు? ఇది పూర్తిగా పబ్లిసిటీ ఇంట్రెస్ట్‌ లిటిగేషన్‌లా ఉన్నది’ అని జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌, జస్టిస్‌ సుధాంశు ధూలియాలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఈ పిటిషన్‌ను ధావన్‌ ఉనియాల్‌ అనే న్యాయవాది దాఖలు చేశారు.

కోర్టు ఈ పిటిషన్‌ను విచారణకు తీసుకోదని గ్రహంచిన ఉనియాల్‌.. ఉపసంహరించుకునేందుకు అవకాశం కోరారు. ఆయన ఉపసంహరించుకున్నందున పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్టు ప్రకటించింది. ‘ఇండియా’ పేరును రాజకీయ పార్టీలు ఉపయోగించుకోవడంపై ఏమైనా ఇబ్బంది ఉంటే పిటిషనర్‌ ఎన్నికల కమిషన్‌ను సంప్రదించాలని ధర్మాసనం పేర్కొన్నది.

ఈ నెల 4వ తేదీన ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ అవసరమన్న కోర్టు.. కేంద్రానికి, ఎన్నికల కమిషన్‌కు, 26 రాజకీయ పార్టీలకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై అక్టోబర్‌ 31న విచారణ చేపట్టనున్నట్టు ప్రకటించింది.