TSRTC | దేశంలోనే తొలిసారిగా… టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ‘పులుల’ ఫోటో ఎగ్జిబిషన్‌

TSRTC | ప్రజలకు అవగాహన కల్పించేందుకు 'హైదరాబాద్‌ ఆన్ వీల్స్‌'లో టైగర్స్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విధాత, హైదరాబాద్‌: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా 'హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌' బస్సులో టైగర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది. పులుల […]

  • By: krs    latest    Jun 09, 2023 3:23 PM IST
TSRTC | దేశంలోనే తొలిసారిగా… టీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో ‘పులుల’ ఫోటో ఎగ్జిబిషన్‌

TSRTC |

  • ప్రజలకు అవగాహన కల్పించేందుకు
  • ‘హైదరాబాద్‌ ఆన్ వీల్స్‌’లో టైగర్స్‌ ఫొటో ఎగ్జిబిషన్‌
  • ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన పీసీసీఎఫ్
  • ఆర్ఎం డోబ్రియాల్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్

విధాత, హైదరాబాద్‌: పులుల సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఫొటోగ్రఫీ ద్వారా జీవవైవిధ్యంలో పులుల ప్రాముఖ్యతను వివరించేందుకు దేశంలోనే తొలిసారిగా ‘హైదరాబాద్‌ ఆన్‌ వీల్స్‌’ బస్సులో టైగర్‌ ఫొటో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేసింది.

పులుల సంరక్షణ, తగ్గిపోతున్న పులుల సంఖ్య పెంచేందుకు ప్రారంభించిన ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సామాజిక బాధ్యతగా ఈ టైగర్ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతాలు, పార్కులు, తదితర ప్రాంతాలకు వెళ్లి పర్యావరణ పరిరక్షణలో పులుల పాత్రను ప్రజలకు వివరించనున్నారు.

ఈ ఎగ్జిబిషన్‌లో ఐసీబీఎం-స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ డీన్‌(అకడమిక్స్‌), వైల్డ్‌ లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌ ప్రొఫెసర్‌ జితేందర్‌ గొవిందాని తీసిన పులుల ఫొటోలను టీఎస్‌ఆర్టీసీ ప్రదర్శిస్తోంది. హైదరాబాద్‌ లోని కేబీఆర్ పార్క్ ప్రాంగణంలో శుక్రవారం ‘హైదరాబాద్‌ ఆన్ వీల్స్’ బస్సులో టైగ‌ర్ ఫొటో ఎగ్జిబిష‌న్ ను ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్(పీసీసీఎఫ్) రాకేశ్ మోహన్ డోబ్రియాల్, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రారంభించారు.

అనంతరం ఇండియన్ ఫోటో ఫెస్టివల్(ఐపీఎఫ్), ఐసీబీఎం-స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎక్స్‌లెన్స్‌ సహకారంతో టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఈ ఎగ్జిబిషన్‌లోని పులుల ఫొటోలు అద్బుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సీసీఎఫ్ సైదులు, ఐపీఎఫ్‌ ప్రతినిధురాలు తరుషా సక్సేనా, తదితరులు పాల్గొన్నారు.