Kokapet | కోకాపేట్‌లో.. BRS పార్టీకి భూమి! హైకోర్టులో పిల్ దాఖలు
Kokapet ఒకటి, రెండు రోజుల్లో చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు విచారణకు.. హైదరాబాద్, విధాత: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం, కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమిని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (NGO) సెక్రటరీ ఎం. పద్మనాభ రెడ్డి సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద పిల్ దాఖలు చేశారు. అత్యంత విలువైన […]

Kokapet
- ఒకటి, రెండు రోజుల్లో చీఫ్ జస్టిస్ బెంచ్ ముందు విచారణకు..
హైదరాబాద్, విధాత: రంగారెడ్డి జిల్లా గండిపేట్ మండలం, కోకాపేట్ గ్రామంలోని సర్వే నంబర్ 239, 240లో ఉన్న 11 ఎకరాల ప్రభుత్వ భూమిని భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయానికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (NGO) సెక్రటరీ ఎం. పద్మనాభ రెడ్డి సోమవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద పిల్ దాఖలు చేశారు. అత్యంత విలువైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం పార్టీ కార్యాలయం కోసం కేటాయించడం సరైంది కాదన్నారు.
ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్‌ని స్థాపించడానికి 11 ఎకరాలు కేటాయించాలని బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీని అభ్యర్థించినప్పటికీ, పార్టీ కార్యాలయాన్ని నిర్మించడం కోసం భూమిని కేటాయించడం సరైందికాదని, దానిని కొట్టివేయాలని పిల్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం కోకాపేట్ గ్రామంలో మార్కెట్ విలులు ఒక ఎకరానికి రూ.50 కోట్లు పలుకుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన 11 ఎకరాల భూమి విలువ రూ. 3,41,25,000/- ఉంటుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. ఇలా వందల, కోట్ల రూపాయ లతో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది, ఆ భూములకు రక్షణ కల్పించాలని పిటీషనర్ పిల్ పేర్కొన్నారు. బంజారాహిల్స్‌లోని రోడ్‌నెంబర్ 12లో 2 ఎకరాల విస్తీర్ణంలో బీఆర్ఎస్ కు ఇప్పటికే పార్టీ కార్యాలయం ఉన్నప్పటికీ 11 ఎకరాలు అన్యాక్రాంతమైన భూమిని సీఎం కేసీఆర్ ప్రతిపాదననతో జిల్లా కలెక్టర్ ఆమోదించారు.
అంతేకాకుండా కోకాపేట్‌లోని భూమిని పార్టీ కార్యాలయానికి కేటాయిస్తూ 2023, మే నెలలో భూమి పూజా కూడా చేశారు. ఇలా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాల పేరుతో కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కొళ్లగొడుతుందని, ఆ భూములను కాపాడాలని పిటీషనర్ పిల్‌లో పేర్కొన్నారు. ఈ కేసులో ప్రతివాదులుగా ప్రధాన కార్యదర్శి, కమిషనర్, హెచ్‌ఎండీఏ, భూపరిపాలన ప్రధాన కమిషనర్, జిల్లా కలెక్టర్, ఆర్‌ఆర్ జిల్లా, బీఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిని ఉంచారు. ఈ పిల్ రెండు రోజుల్లో ప్రధాన న్యాయమూర్తి ముందుకు విచారణకు రానున్నది.