PM Modi | నేడు హైదరాబాద్‌కు మోదీ! సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ రైలుకు ప్రారంభోత్సవం
PM Modi | ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.11,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో పాటు పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర పోలీసుల బలగాలతో పాటు ఎస్పీజీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. బీజేపీ శ్రేణులతో ప్రధానికి ఘన […]

PM Modi |
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన రూ.11,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందేభారత్ రైలును ప్రారంభించడంతో పాటు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో పాటు పలు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో అధికారులన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్ర పోలీసుల బలగాలతో పాటు ఎస్పీజీ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించాయి. బీజేపీ శ్రేణులతో ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశాయి. హైదరాబాద్ నగరవ్యాప్తంగా స్వాగత తోరణాలు, ఫ్లెక్సీలు వెశాయి.
ఇదిలా ఉండగా.. ప్రధాని ఉదయం 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడ సికింద్రాబాద్ – తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు.
ఆ తర్వాత అక్కడే రైల్వేస్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం హైదరాబాద్-మహబూబ్‌నగర్ రైల్వే డబ్లింగ్ పనులను ప్రారంభిస్తారు. ఇక ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్‌లో భాగంగా 13 లోకల్ ట్రైన్లను ప్రధాని మోదీ పచ్చజెండా ఊపనున్నారు. మధ్యాహ్నం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు.
12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు పరేడ్ గ్రౌండ్స్ తో వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఐదు జాతీయ రహదారుల పనులను ప్రారంభించడంతోపాటు బీబీనగర్ ఎయిమ్స్‌కు సంబంధించిన కొత్త భవనం నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. అదే బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారు. 1.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి తిరిగి ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
ప్రధాని కార్యక్రమం నేపథ్యంలో అధికారులు సీఎం కేసీఆర్‌కు సైతం ఆహ్వానం పంపారు. పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే సభలో కేసీఆర్ ప్రసంగం కోసం 7 నిమిషాల సమయం సైతం ఇచ్చారు. అయితే, ప్రధాని పర్యటనకు ఈ సారి సైతం కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ఇక ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మోదీకి స్వాగతం పలుకనున్నారు.