Tiger Dies | తెల్లపులికి గుండెపోటు.. హనుమకొండ జూ పార్కులో విషాదం
Tiger Dies | హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూపార్కులో విషాదఛాయలు అలుముకున్నాయి. తెల్లపులి చరణ్(15) గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి మయూరి తెలిపారు.
Tiger Dies | హనుమకొండ హంటర్ రోడ్డులోని కాకతీయ జూపార్కులో విషాదఛాయలు అలుముకున్నాయి. తెల్లపులి చరణ్(15) గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి మయూరి తెలిపారు.
ఈ తెల్లపులిని అటవీశాఖ అధికారులు గతేడాది జులై నెలలో అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ చేతుల మీదుగా సందర్శకుల దర్శనార్థం కాకతీయ జూపార్కులోకి తీసుకొచ్చారు. అయితే గత రెండు నెలల నుంచి పులి అనారోగ్యంతో బాధపడుతోంది. గుండెపోటుతో పాటు ఊపిరితిత్తులు పని చేయక తెల్లపులి మృతి చెందినట్లు చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పేర్కొన్నారు.
సాధారణంగా తెల్లపులి జీవితకాలం సుమారు 14 ఏళ్లు. జూపార్కులోని వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణ, సకాలంలో మందులు అందించడంతో ఒక ఏడాది ఎక్కువగానే జీవించిందని పేర్కొన్నారు. మామునూరులోని వెటర్నరీ కాలేజీలో కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి నమూనాలను హైదరాబాద్‌కు పంపించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram