వ‌డ్డీరేట్ల‌ను పెంచిన‌ పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ

విధాత‌: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (PNB), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC LTD) రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచాయి. పావు శాతం వర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. కొత్త వ‌డ్డీరేట్లు బుధ‌వారం నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. తాజా నిర్ణ‌యంతో హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్ ప్రైం లెండింగ్ రేటు (RPLR) 25 బేసిస్ పాయింట్లు పెరిగి 9.20 శాతానికి చేరింది. అయితే 760, అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న‌వారికి 8.7 శాతం ప్రారంభ వ‌డ్డీరేటుకే రుణాల‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఇస్తామంటున్న‌ది. అలాగే ప్ర‌భుత్వ రంగ బ్యాంకైన […]

వ‌డ్డీరేట్ల‌ను పెంచిన‌ పీఎన్‌బీ, హెచ్‌డీఎఫ్‌సీ

విధాత‌: పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ (PNB), హెచ్‌డీఎఫ్‌సీ (HDFC LTD) రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను పెంచాయి. పావు శాతం వర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించాయి. కొత్త వ‌డ్డీరేట్లు బుధ‌వారం నుంచే అమ‌ల్లోకి వ‌చ్చాయి. తాజా నిర్ణ‌యంతో హెచ్‌డీఎఫ్‌సీ రిటైల్ ప్రైం లెండింగ్ రేటు (RPLR) 25 బేసిస్ పాయింట్లు పెరిగి 9.20 శాతానికి చేరింది. అయితే 760, అంత‌కంటే ఎక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్న‌వారికి 8.7 శాతం ప్రారంభ వ‌డ్డీరేటుకే రుణాల‌ను హెచ్‌డీఎఫ్‌సీ ఇస్తామంటున్న‌ది.

అలాగే ప్ర‌భుత్వ రంగ బ్యాంకైన పీఎన్‌బీ మార్జిన‌ల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను అన్ని టెన్యూర్స్‌పై 10 బేసిస్ పాయింట్లు పెంచుతున్న‌ట్లు తెలిపింది. ఏడాది ఎంసీఎల్ఆర్ 8.4 శాతం నుంచి 8.5 శాతానికి పెంచుతున్న‌ట్లు స్ప‌ష్టం చేసింది. దీంతో వ్య‌క్తిగ‌త‌, గృహ త‌దిత‌ర రుణాల‌పై వ‌డ్డీరేట్లు పెరిగాయి.

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఫిబ్ర‌వ‌రి ద్ర‌వ్య‌స‌మీక్ష‌లో రెపోరేటు (REPO RATE)ను 25 బేసిస్ పాయింట్లు పెంచిన విష‌యం తెలిసిందే. దీంతో అది 6.5 శాతానికి చేరింది. ప్ర‌స్తుతం దేశంలోని బ్యాంకుల‌న్నీ ఈ రెపోరేటు ఆధారంగానే రుణాల‌పై వ‌డ్డీరేట్ల‌ను నిర్ణ‌యిస్తున్నాయి. ఫ‌లితంగా రెపో పెరిగితే త‌మ వ‌డ్డీల‌ను బ్యాంకింగ్‌ (BANKING), నాన్‌-బ్యాంకింగ్ (NON-BANKING) సంస్థ‌లు పెంచేస్తున్నాయి.