Car loan : ఇప్పుడు కారు అనేది అందరికీ కామన్ వెహికిల్‌గా మారిపోయింది. చాలామంది ఎక్కడికి వెళ్లాలన్నా కారు ప్రయాణానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రం ఉన్న వాళ్లు కూడా అప్పోసస్పో చేసి కారు కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ల కొనుగోలు కోసం బ్యాంకులు తక్కువ వడ్డీలకే లోన్లు ఇస్తున్నాయి. బిజినెస్ పెంచుకోవడం పోటీపడి ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి.
Car loan : ఇప్పుడు కారు అనేది అందరికీ కామన్ వెహికిల్‌గా మారిపోయింది. చాలామంది ఎక్కడికి వెళ్లాలన్నా కారు ప్రయాణానికే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆర్థిక స్తోమత అంతంత మాత్రం ఉన్న వాళ్లు కూడా అప్పోసస్పో చేసి కారు కొనుగోలు చేస్తున్నారు. అయితే కార్ల కొనుగోలు కోసం బ్యాంకులు తక్కువ వడ్డీలకే లోన్లు ఇస్తున్నాయి. బిజినెస్ పెంచుకోవడం పోటీపడి ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. కాబట్టి మీరు కారు లోన్ కోసం గనుక ప్రయత్నిస్తున్నట్లయితే ఈ కింది బ్యాంకులు ఆఫర్ చేస్తున్న వడ్డీ రేట్లను ఒకసారి పరిశీలించండి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union Bank of India) నాలుగేళ్ల కాలానికి రూ.10 లక్షల కారు లోన్ ఇస్తోంది. ఈ లోన్‌పై 8.70 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. అంటే నాలుగేళ్లపాటు నెలకు రూ.24,565 వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) అయితే రూ.10 లక్షల కారు లోన్‌పై నాలుగేళ్ల కాలానికి 8.75 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఎస్బీఐతోపాటు పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ తదితర బ్యాంకులు కూడా నాలుగేళ్లకు 8.75 శాతం వడ్డీకి కార్ లోన్లను అందిస్తున్నాయి. నెల వారీ వాయిదే రూ.24,587 చెల్లించాలి.
బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) రూ.10 లక్షల కారు లోన్‌పై నాలుగేళ్ల కాలానికి 8.85 శాతం చొప్పున వడ్డీని వసూలు చేస్తున్నది. అంటే నెలకు రూ.24,632 లెక్కన వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) నాలుగేళ్ల కాలానికి రూ.10 లక్షల కారు లోన్‌పై 8.90 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నది. కాబట్టి ఈ లోన్ తీసుకుంటే నెలకు రూ.24,655 లెక్కన వాయిదాలు చెల్లించాలి.
ICICI బ్యాంకు నాలుగేళ్ల కాలానికి రూ.10 లక్షల కారు లోన్‌పై 9.10 శాతం చొప్పున వడ్డీని వసూలు చేస్తున్నది. ఈ లోన్ తీసుకుంటే ఈఎంఐ నెలకు రూ.24,745 లెక్కన పే చేయాలి.
యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) నాలుగేళ్ల కాలానికి రూ.10 లక్షల కారు లోన్‌పై 9.30 శాతం చొప్పున వడ్డీని వసూలు చేస్తున్నది. అంటే యాక్సిస్ బ్యాంకు లోన్ తీసుకుంటే నెలకు రూ.24,835 లెక్కన ఈఎంఐ కట్టాలి.
HDFC బ్యాంక్ నాలుగేళ్ల కాలానికి రూ.10 లక్షల కారు లోన్‌పై 9.40 శాతం లెక్కన వడ్డీ వసూలు చేస్తున్నది. అంటే ఈఎంఐ రూపేణ నెలకు రూ.24,881 చెల్లించాలి.