Bapatla | సముద్రంలో దూకి ఇద్దరి ప్రాణాలు కాపాడిన పోలీస్
Bapatla | విధాత: ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా కొత్తపట్నం బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకుపోతుండగా ఓ మెరైన్ పోలీస్ సాహసం చేసి వారిని రక్షించారు. తన ప్రాణాలను లెక్కచేయకుండా సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. వారికి ప్రాథమిక చికిత్స అందించి, బంధువులకు అప్పగించారు. ఆ పర్యాటకులు కర్నూలుకు చెందినవారిగా గుర్తించారు. కాగా సాహసంతో పర్యాటకులను రక్షించిన పోలీసును డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.

Bapatla |
విధాత: ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా కొత్తపట్నం బీచ్‌లో స్నానానికి దిగిన ఇద్దరు పర్యాటకులు అలల ధాటికి కొట్టుకుపోతుండగా ఓ మెరైన్ పోలీస్ సాహసం చేసి వారిని రక్షించారు. తన ప్రాణాలను లెక్కచేయకుండా సముద్రంలో ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.
వారికి ప్రాథమిక చికిత్స అందించి, బంధువులకు అప్పగించారు. ఆ పర్యాటకులు కర్నూలుకు చెందినవారిగా గుర్తించారు. కాగా సాహసంతో పర్యాటకులను రక్షించిన పోలీసును డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభినందించారు.