సీఎం కేసీఆర్ కాన్వాయ్ నుంచి జారిపడ్డ మహిళా పోలీసు
విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ నుంచి ఓ మహిళా పోలీసు ఆఫీసర్ జారిపడింది. పోలీసు ఆఫీసర్‌ను గమనించని డ్రైవర్ అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. మరో కాన్వాయ్‌లో మహిళా పోలీసు ఎక్కి వెళ్లింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. మహిళా పోలీసు ఒక చేతిలో శాలువా, మరో చేతిలో వాకిటాకీ పట్టుకుని కాన్వాయ్ ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారిణి కింద పడటంతో ఆమె వద్ద రివాల్వర్ కింద […]

విధాత: ముఖ్యమంత్రి కేసీఆర్ కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. సీఎం కాన్వాయ్ నుంచి ఓ మహిళా పోలీసు ఆఫీసర్ జారిపడింది. పోలీసు ఆఫీసర్‌ను గమనించని డ్రైవర్ అలాగే వాహనాన్ని ముందుకు పోనిచ్చాడు. మరో కాన్వాయ్‌లో మహిళా పోలీసు ఎక్కి వెళ్లింది. ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి.

మహిళా పోలీసు ఒక చేతిలో శాలువా, మరో చేతిలో వాకిటాకీ పట్టుకుని కాన్వాయ్ ఎక్కుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసు అధికారిణి కింద పడటంతో ఆమె వద్ద రివాల్వర్ కింద పడిపోయింది. మరో కానిస్టేబుల్‌ను ఆమెకు సహాయం అందించారు.

అయితే వరంగల్ పర్యటనకు వెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జనగామ జిల్లా పెంబర్తి వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఘనస్వాగతం పలికారు. దీంతో కేసీఆర్ అక్కడ తన కాన్వాయ్‌ను ఆపారు. కారులో నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌కు మంత్రి దయాకర్ రావు శాలువా కప్పి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలోనే కాన్వాయ్ మళ్లీ వెళ్తుండగా, మహిళా పోలీసు ఆఫీసర్ జారిపడింది.