Prabhas and Anushka విధాత: ప్రభాస్, అనుష్కల జంట సిల్వర్ స్క్రీన్ మీద మెరవడం అంటే అది ఇద్దరి అభిమానులకీ పండగే. వీళ్ళు ఇద్దరూ కలిసి చేసిన సినిమాల లిస్ట్ కూడా పెద్దదే.. ‘బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్’.. ఇవన్నీ మంచి హిట్స్‌గా నిలిచి కలెక్షన్స్ వర్షం కురిపిచాయి. వారిద్దరి సినిమాలే కాదు.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే రూమర్స్‌కు కూడా కలెక్షన్స్ పెడితే.. బాక్స్ బద్దలయ్యేది. అలా వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి రూమర్స్. […]
Prabhas and Anushka
విధాత: ప్రభాస్, అనుష్కల జంట సిల్వర్ స్క్రీన్ మీద మెరవడం అంటే అది ఇద్దరి అభిమానులకీ పండగే. వీళ్ళు ఇద్దరూ కలిసి చేసిన సినిమాల లిస్ట్ కూడా పెద్దదే.. ‘బిల్లా, మిర్చి, బాహుబలి సిరీస్’.. ఇవన్నీ మంచి హిట్స్‌గా నిలిచి కలెక్షన్స్ వర్షం కురిపిచాయి. వారిద్దరి సినిమాలే కాదు.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే రూమర్స్‌కు కూడా కలెక్షన్స్ పెడితే.. బాక్స్ బద్దలయ్యేది. అలా వచ్చాయి.. వస్తూనే ఉన్నాయి రూమర్స్. అయితే ఇలా వచ్చిన ప్రతిసారి.. అవన్నీ ఒట్టి రూమర్సే అని తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకుంటూ వచ్చారు.. వస్తున్నారు.
సరే.. ప్రేమ, పెళ్లి సంగతి పక్కన పెడితే.. మంచి కెమిస్ట్రీ ఉన్న వీళ్ళద్దరినీ ప్రేక్షకుల ముందుకి మరోమారు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రం తెలుస్తోంది. అయితే దీని గురించి ఎక్కడా వివరాలు అధికారికంగా బైటకు రాలేదు కానీ బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ.. ప్రభాస్, అనుష్కలతో పాన్ వరల్డ్ రేంజ్లో ఓ మూవీకి ప్లాన్ చేస్తున్నాడట.
దీనికి ప్రభాస్ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చేసిందనేలా వార్తలు వినిపిస్తున్నాయి. మిర్చి, బాహుబలి సిరీస్ చిత్రాలతో వీరిద్దరిది మంచి కాంబినేషన్ అనే మార్కులు ఎలానో పడ్డాయి. ఇక మళ్ళీ వీళ్ళతో సినిమా అంటే అది బ్లాక్ బాస్టర్ పక్కా అని ఫిక్సయిపోవచ్చు. అందుకే శోభు యార్లగడ్డ ఆ ప్రయత్నాలలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆయన ‘బాహుబలి’ ఇచ్చిన కిక్ అలాంటిది మరి.
ఇక ప్రభాస్‌కు సంబంధించి మరో వార్త కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. స్టార్ డైరెక్టక్ లోకేష్ కనగరాజ్ త్వరలోనే ప్రభాస్ హీరోగా సినిమా ఫ్లాన్ చేయబోతున్నాడట. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై ఈ మూవీ ఉంటుందని అంటున్నారు. ఇదే విషయాన్ని ఈమధ్య ఓ ఇంటర్య్వూలో లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ లియో షూటింగ్ పూర్తి కాగానే ప్రభాస్‌తో తీయబోయే సినిమాపై క్లారిటీ ఇస్తానని అన్నట్లుగా తెలుస్తోంది. ఇక ‘లియో’ మూవీ షూటింగ్ పూర్తయింది. ఎప్పుడెప్పుడు అతని నోటి వెంట ప్రభాస్ సినిమాకు సంబంధించిన వార్త వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతగానో వేచి చూస్తున్నారు.