Virat Kohli: అయోధ్య హనుమాన్ గర్హి ఆలయాన్ని దర్శించిన కోహ్లీ దంపతులు!

Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్కతో కలిసి ఆదివారం అయోధ్యలోని హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ పూజరు విరాట్ దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం ఆలయ జ్ఞాపికలను అందించారు. టీ 20ప్రపంచకప్ విజయం తర్వాత పొట్టి క్రికెట్ కు, తాజాగా టెస్టు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నారు.
టెస్టు క్రికెట్ రిటైర్మెంట్ తర్వాతా యూపీలోని తన ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ గోవింద్ శరణ్ జీ మహరాజ్ స్వామీజీ బృందావన్ ఆశ్రమాన్ని సందర్శించి ఆయన ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం హనుమాన్ గర్హి ఆలయాన్ని సందర్శించారు. ప్రస్తుతం ఐపీఎల్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న విరాట్ కోహ్లీ ఈసారైనా తన జట్టు ఐపీఎల్ కప్ విజేతగా నిలవాలన్న కల నెరవేరాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే ప్లే ఆప్ చేరుకున్న ఛాలెంజర్స్ జట్టు కప్ రేసులో దూసుకెలుతుంది.