Ayodhya Ram : బాలరాముడి దివ్య సుందర రూపం..చూడతరమా!
అయోధ్య రామమందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి దివ్య సుందర అలంకరణ వీడియో వైరల్ అవుతోంది. స్వర్ణాభరణాలు, పూలమాలలతో బాలరాముడి మంగళ స్వరూపం భక్తులను మంత్రముగ్ధులను చేస్తోంది.
విధాత : అయోధ్య భవ్య రామమందిరంలో దివ్యమంగళమైన సుందర బాలరాముడిని ప్రతిష్టించి ఏడాది పూర్తయ్యింది. అయోధ్య బాలరాముడికి సంబంధించిన ఏ వార్త అయినా.. భక్త జనాన్ని విశేషంగా ఆకట్టుకుంటూ వస్తుంది. రామమందిరం ప్రారంభోత్సవ వార్షికోత్సవం వేళ బాలరాముడిని నిత్యం అత్యంత సుందరంగా అలంకరిస్తూ వస్తున్నారు. జగన్మోహుడైన బాలరాముడి విగ్రహ అలంకరణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలరాముడి విగ్రహ నిర్మాణమే అనేక విశేషాల సమాహారం అనుకుంటే..నిత్యం భక్తులకు దర్శనమిచ్చే ఆ స్వామి వారి నిత్యాలంకార సేవలు మరిన్ని విశేషాలతో ఆకట్టుకుంటున్నాయి.
ఆపాద మస్తకం స్వామివారి అలంకారంలో వినియోగించిన రత్నఖచిత స్వర్ణాభరణాలు, కంకణాలు, కడియాలు, హారాలు, కిరీటం, ధనుర్బాణాలు, వస్త్రాలంకరణ.. సుగంధ భరిత రంగుల పూలమాలలు అంతా అద్భుత విశేషాలతో, ప్రత్యేకతలతో కూడి ఉండటంతో ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. బాలరాముడిని నేరుగా దర్శించుకోని వారు ఈ వీడియోను చూసి ఆహా..ఎంతటి అద్బత సౌందర్య శోభితం…అయోధ్య బాలరాముడి దివ్య మంగళ స్వరూపం అంటూ భక్తీ పారవశ్యంతో తన్మయులవుతున్నారు.
Not just Maryada Purushottam — the Lord of empathy. pic.twitter.com/yJUrs9GAVz
— श्री (@shree_2_2) January 2, 2026
ఇవి కూడా చదవండి :
India vs New Zealand ODI Squad : న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు భారత్ జట్టు ప్రకటన
Telangana Assembly : జలాలపై చర్చ..గాఢ నిద్రలో బీజేపీ ఎమ్మెల్యేలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram