Telangana Assembly : జలాలపై చర్చ..గాఢ నిద్రలో బీజేపీ ఎమ్మెల్యేలు
కృష్ణా జలాలపై అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ PPT ఇస్తుంటే.. బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం గాఢ నిద్రలో మునిగిపోయారు. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చకు దారితీశాయి.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చర్చ జరుగుతున్న సమయంలో సభలో బీజేపీ ఎమ్మెల్యేలు నిద్ర పోతు కనిపించిన దృశ్యాలు వైరల్ గా మారాయి. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గణంకాలు, జీవోలతో సహా కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులపై వివరిస్తున్న క్రమంలో ఇంకోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు నిద్రిస్తు కనిపించారు. ఆ సమయంలో మంత్రి ఉత్తమ్ బ్రిజేష్ ట్రిబ్యూనల్ త్వరలో జడ్జ్ మెంట్ ఇవ్వబోతున్న అంశాన్ని వివరిస్తున్నారు.
ప్రభుత్వం తరుపునా కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే క్రమంలో బీఆర్ఎస్ ఆరోపణలను గట్టిగా తిప్పికొట్టారు. కేంద్రం తరఫునా తీసుకోవాల్సిన చర్యలను సైతం గుర్తు చేశారు. చర్చ సందర్బంగా ప్రభుత్వం వాదన విని ప్రభుత్వ విధానాలపైన, బీఆర్ఎస్ తీరుపైన, కేంద్రం వైఖరిపైన తమ వాదనలు వినిపించాల్సిన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ రకంగా నిద్రపోవడం పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తుండగా గాఢ నిద్రలోకి జారుకున్న బీజేపీ ఎమ్మెల్యేలు pic.twitter.com/JQ2qvxHTVv
— Telugu Scribe (@TeluguScribe) January 3, 2026
ఇవి కూడా చదవండి :
Haindava | బెల్లంకొండ శ్రీనివాస్ నుండి మరో ఇంట్రెస్టింగ్ చిత్రం… బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్
బర్సా సహా 20మంది మావోయిస్టుల లొంగుబాటు : తెలంగాణ డీజీపీ వెల్లడి
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram