Uttam Kumar Reddy : బీఆర్ఎస్ పాలకులే తెలంగాణ జల ద్రోహులు

కృష్ణా బేసిన్‌లో ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని బీఆర్ఎస్ పాలకులే తెలంగాణ జల ద్రోహులని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Uttam Kumar Reddy : బీఆర్ఎస్ పాలకులే తెలంగాణ జల ద్రోహులు

విధాత, హైదరాబాద్: పదేళ్ల పాటు అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి1లక్ష 83వేలు కోట్లు ఖర్చు పెట్టి కృష్ణా బేసిన్ లోని కృష్ణా బేసిన్ లోని ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని బీఆర్ఎస్ పాలకులు జల ద్రోహులు అని ఉత్తమ్ విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ చారిత్రాక తప్పిదాలను మేం సరిచేస్తున్నామన్నారు. మేడిగడ్డ కూలిపోయినా తెలంగాణ ధాన్యం దిగుబడిలో అగ్రగామిగా ఉందన్నారు. కృష్ణా బేసిన్ ప్రాజెక్టులన్ని మేం పూర్తి చేస్తామని, రాష్ట్రానికి రావాల్సిన కృష్ణా జలాల హక్కులలో ఎలాంటి అన్యాయం జరుగకుండా చూస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు. కృష్ణా జలాలు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పై అసెంబ్లీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఆయన మాట్లాడారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణంపై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 90టీఎంసీలతోనే ప్రాజెక్టుని ముందుకు తీసుకెళ్తున్నామని, బీఆర్ ఎస్ ఇచ్చిన జీవో మేరకే మైనర్ ఇరిగేషన్ సేవింగ్స్ లో 45టీఎంసీలు, గోదావరి వాటర్ డైవర్షన్ లో మరో 45 టీఎంసీలు నీళ్లతోనే ప్రాజెక్టుని నిర్మిస్తామని స్పష్టం చేశారు. 2022లో గత ప్రభుత్వం కూడా ఇదే విధంగా జీవో ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో మా ప్రభుత్వం ఇచ్చిన లేఖను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తుందన్నారు.

బీఆర్ఎస్ హయాంలోనే అధిక జల దోపిడీ

2014-2023 మధ్య దాదాపు 1200టీఎంసీల కృష్ణా నీళ్లను శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ అక్రమంగా తరలించుకపోయిందని ఉత్తమ్ ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే బీఆర్ఎస్ హయాంలోనే కృష్ణా జలాల దోపిడీ ఎక్కువ జరిగిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, ఇంటర్ స్టేట్ క్లియరెన్స్ కూడా లేదన్నారు. జూరాల నుంచి ప్రాజెక్టును శ్రీశైలానికి మార్చి తీరని నష్టం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై మోజుతో కుట్ర పూరితంగా పాలమూరు ఎత్తిపోతలను పడకేయించారని, దీంతో ప్రస్తుతం దీని వ్యయం 80కోట్లకు చేరిందన్నారు. బీఆర్ఎస్ 27వేల కోట్లు ఖర్చు చేసి 90శాతం పూర్తి చేసిందని అబద్దాలు చెబుతుందన్నారు. వాటిలో పెండింగ్ బిల్లులను సైతం మా నెత్తిన వేసి పోయారన్నారు. 2019లో పబ్లిక్ హియరింగ్ ప్రకటించి రెండేళ్లు దాటవేశారన్నారు. తర్వాత వచ్చిన కాళేశ్వరానికి 2015లో పబ్లిక్ హియరింగ్ చేస్తే..ముందు ప్రారంభించిన పాలమూరుకు 2021లో పబ్లింగ్ హియరింగ్ చేశారని తెలిపారు.

పాలమూరును 7.15టీఎంసీని కేవలం మంచినీళ్ల కోసం కడుతున్నామని సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ చెప్పిందని గుర్తు చేశారు. తాము పర్యావరణ అనుమతులు సాధించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామన్నారు. డీపీఆర్ 2103 తిరిగి వచ్చిందని, బీఆర్ఎస్ హాయంలో రెండు సార్లు, మా హయాంలో రెండుసార్లు ఇచ్చారని తెలిపారు. పోలవరం బనకచర్లపై సుప్రీంకోర్టులో కేసు వేశామని..దానికి ఎలాంటి అనుమతులు రాలేదని ఉత్తమ్ పునరుద్ఘాటించారు. గోదావరిలో 1000టీఎంసీలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవడం తెలుగు రాష్ట్రాల మధ్య బేసిన్ లు లేవు బేషజాలు లేవని కేసీఆర్ ఆంధ్ర జలదోపిడికి మద్దతు పలికారన్నారు. జగన్ తో కేసీఆర్ ఆలయ్ బలాయ్ చేసుకుని తెలంగాణకు నష్టం చేసేలా ఏపీ అక్రమ ప్రాజెక్టులకు ఊతమిచ్చాడని ఉత్తమ్ ఆరోపించారు. తెలంగాణ కృష్ణా, గోదావరి నది జలాలపై చర్చించడానికైనా సిద్దంగా ఉన్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Telangana Assembly : జలాలపై చర్చ..గాఢ నిద్రలో బీజేపీ ఎమ్మెల్యేలు
Donald Trump : అమెరికా సైన్యం అదుపులో వెనుజులా అధ్యక్షుడు