Haindava | బెల్లంకొండ శ్రీనివాస్ నుండి మరో ఇంట్రెస్టింగ్ చిత్రం… బర్త్ డేకి అదిరిపోయే ట్రీట్
Haindava |యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇవాళ (జనవరి 3) బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’ నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.
Haindava |యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ మరో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇవాళ (జనవరి 3) బెల్లంకొండ శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘హైందవ’ నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో మంచి హైప్ క్రియేట్ చేస్తోంది. గతేడాది జనవరిలోనే ‘హైందవ’ టైటిల్ గ్లింప్స్ విడుదల చేసి ఆసక్తి పెంచిన మేకర్స్, ఇప్పుడు ఫుల్ లెంగ్త్ పోస్టర్‌తో అంచనాలను మరింత పెంచారు. పోస్టర్ చూస్తే ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ పవర్‌ఫుల్, ఇంటెన్స్ క్యారెక్టర్ చేయబోతున్నాడని స్పష్టంగా తెలుస్తోంది.
యాక్షన్ మోడ్‌లో బెల్లంకొండ
‘హైందవ’ పోస్టర్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో కాగడా పట్టుకుని పోరాటానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తున్నాడు. ఆయన వెనుక నిప్పుల్లాంటి కళ్లతో ఉన్న వారాహం పోస్టర్‌కు మైథాలజికల్ టచ్ ఇచ్చింది. ఆ వారాహం కొమ్ములు హీరోకే మొలిచినట్లుగా డిజైన్ చేయడం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.ఈ సినిమాకు లుధీర్ బైరెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, సంయుక్త హీరోయిన్‌గా నటిస్తోంది. మూన్ షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
మైథాలజీ బేస్డ్ థ్రిల్లర్?
“ఎప్పుడైతే ఓ పవర్‌ఫుల్ శక్తి ఏర్పడుతుందో… అప్పుడు దశావతారాల అండ ఉంటుంది. త్వరలో థియేటర్లలో హైందవ” అనే క్యాప్షన్‌తో పోస్టర్‌ను రిలీజ్ చేయడం సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. దీనిని బట్టి చూస్తే ‘హైందవ’ ఒక మైథాలజీ బేస్డ్ థ్రిల్లర్గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది.
కిష్కింధపురి తర్వాత మరో బలమైన ప్రయత్నం
గతేడాది చివర్లో విడుదలైన ‘కిష్కింధపురి’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌కు ఆ సినిమా కెరీర్‌కు మంచి బూస్ట్ ఇచ్చింది. ఇకపై కంటెంట్ ఉన్న కథలనే ఎంచుకుంటూ ముందుకెళ్తున్న ఆయన, అదే దారిలో ‘హైందవ’ను పట్టాలెక్కించారు. బర్త్ డే సందర్భంగా విడుదలైన పోస్టర్‌తోనే ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేస్తోంది.
కెరీర్ ట్రాక్ రికార్డ్
2014లో ‘అల్లుడు శీను’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, కవచం, సీత వంటి సినిమాలు చేసినా ఆశించిన స్థాయి హిట్స్ రాలేదు. అయితే ‘రాక్షసుడు’ సినిమాతో రూట్ మార్చి పెద్ద హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, ‘కిష్కింధపురి’ తో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు ‘హైందవ’ తో మరోసారి థియేటర్లలో రచ్చ చేయడానికి బెల్లంకొండ శ్రీనివాస్ సిద్ధమయ్యాడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆయన ఖాతాలో మరో హిట్‌గా నిలుస్తుందా లేదా అన్నది వేచి చూడాల్సిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram