Vijay-Rashmika | ఉదయ్‌పూర్‌లో విజయ్–రష్మికల పెళ్లి .. గత రాత్రి ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించిన క్యూట్ కపుల్
Vijay-Rashmika | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌పై పుకార్లు వస్తూనే ఉండగా, తాజాగా వివాహం గురించిన వార్తలు మరింత వేగం పుంజుకున్నాయి.
Vijay-Rashmika | టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరి రిలేషన్‌పై పుకార్లు వస్తూనే ఉండగా, తాజాగా వివాహం గురించిన వార్తలు మరింత వేగం పుంజుకున్నాయి. గత ఏడాదే ఈ జంట రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందని, ఇప్పటివరకు దానిని సీక్రెట్‌గా ఉంచారని వినిపిస్తున్న టాక్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని చారిత్రక నగరం ఉదయ్‌పూర్‌లో వీరిద్దరి వివాహం జరగనుందని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. ఈ వార్తలకు మరింత బలం చేకూర్చేలా ఆదివారం రాత్రి విజయ్, రష్మిక ఇద్దరూ కలిసి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించడం చర్చనీయాంశమైంది. పెళ్లి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించేందుకే ముందుగానే ఉదయ్‌పూర్‌కు బయలుదేరినట్లు సమాచారం వినిపిస్తోంది. అయితే ఈ పెళ్లి వార్తలపై అటు విజయ్ గానీ, ఇటు రష్మిక గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఈ రూమర్స్ ఒకవైపు చక్కర్లు కొడుతుండగా, వృత్తిపరంగా కూడా ఈ క్రేజీ కాంబినేషన్ మళ్లీ తెరపై సందడి చేయబోతోంది. దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ తెరకెక్కిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా రణబాలిలో ఈ జంట కలిసి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగా, అధికారిక అప్‌డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో ఈ జోడీ ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది. అదే మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా అన్న ఉత్కంఠ అభిమానుల్లో కనిపిస్తోంది. పెళ్లి పుకార్లు నిజమా కాదా అన్నది అధికారిక ప్రకటన వచ్చేవరకు సస్పెన్స్‌గానే ఉండనుంది. కానీ ఈ జంట గురించి ప్రతి చిన్న అప్‌డేట్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram