ఈవెంట్‌పై రాళ్ల దాడి.. యువకులను స్తంభానికి క‌ట్టేసి చిత‌క్కొట్టిన పోలీసులు (వీడియో)

విధాత: న‌వ రాత్రుల సంద‌ర్భంగా గుజ‌రాత్‌లోని ఖేడా జిల్లాలోని ఉంధేలా గ్రామంలో గ‌ర్భా వేడుక‌ల‌ను నిర్వ‌హించగా ఈ వేడుక‌ల్లో మ‌హిళ‌లు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో ఓ ఇద్ద‌రు ముస్లిం యువ‌కులు ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడున్న మ‌హిళ‌లు, చిన్నారుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు. అక్కడే ఉన్న స్థానికులు వారిని మంద‌లించినప్పటికీ వారు ఏ మాత్రం తగ్గలేదు. కాసేప‌టికే 150 మంది దాకా ముస్లిం యువ‌కులు ఆ వేడుక‌ల వ‌ద్ద‌కు చేరుకుని రాళ్లతో వారిపై […]

ఈవెంట్‌పై రాళ్ల దాడి.. యువకులను స్తంభానికి క‌ట్టేసి చిత‌క్కొట్టిన పోలీసులు (వీడియో)

విధాత: న‌వ రాత్రుల సంద‌ర్భంగా గుజ‌రాత్‌లోని ఖేడా జిల్లాలోని ఉంధేలా గ్రామంలో గ‌ర్భా వేడుక‌ల‌ను నిర్వ‌హించగా ఈ వేడుక‌ల్లో మ‌హిళ‌లు, చిన్నారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే ఈ క్రమంలో ఓ ఇద్ద‌రు ముస్లిం యువ‌కులు ఆ ప్రాంతానికి చేరుకుని అక్కడున్న మ‌హిళ‌లు, చిన్నారుల‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించారు.

అక్కడే ఉన్న స్థానికులు వారిని మంద‌లించినప్పటికీ వారు ఏ మాత్రం తగ్గలేదు. కాసేప‌టికే 150 మంది దాకా ముస్లిం యువ‌కులు ఆ వేడుక‌ల వ‌ద్ద‌కు చేరుకుని రాళ్లతో వారిపై దాడి చేశారు.

విషయం తెలుసుకున్న పొలీసులు సాధార‌ణ దుస్తుల్లో రంగ ప్ర‌వేశం చేసి రాళ్ల దాడి చేసిన వారిలో ఓ ప‌ది మందిని అదుపులోకి తీసుకుని వారిని అక్కడే ఉన్న ఓ స్తంభానికి క‌ట్టేసి చిత‌క్కొట్టారు. లాఠీలు ఝులిపించారు.

అనంతరం ఆ ప‌ది మందితో గ్రామస్తుల‌కు క్ష‌మాప‌ణ‌లు చెప్పించడంతో గ్రామ‌స్తులు సంతోషం వ్య‌క్తం చేశారు. అయితే రాళ్ల దాడికి పాల్ప‌డిన ఘటనలో 43 మందిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు.