Swami Vivekananda | ప్రతి హీరోకి, దర్శకుడికి కూడా తమకంటూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీనిని తన కెరియర్ పూర్తయ్యే లోపు పూర్తి చేసేయాలనే ఆలోచనలో ఉంటారు. దానికి తగిన ఫ్లాన్ అనుకునే ఉంటారు. అలాగే ఓ హీరో దాదాపు తన అరవై ఏళ్ళ వయసులోనూ ఆ కథను తెరకు ఎక్కించాలనే ఆశతోనే ఉన్నాడు. అయితే తీరా తన ప్రాజెక్ట్‌ను తెర మీదకు తెస్తానని మాట ఇచ్చిన దర్శకుడు మాత్రం ఇచ్చిన మాట మరిచిపోయి తన […]
Swami Vivekananda |
ప్రతి హీరోకి, దర్శకుడికి కూడా తమకంటూ ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉంటుంది. దీనిని తన కెరియర్ పూర్తయ్యే లోపు పూర్తి చేసేయాలనే ఆలోచనలో ఉంటారు. దానికి తగిన ఫ్లాన్ అనుకునే ఉంటారు. అలాగే ఓ హీరో దాదాపు తన అరవై ఏళ్ళ వయసులోనూ ఆ కథను తెరకు ఎక్కించాలనే ఆశతోనే ఉన్నాడు.
అయితే తీరా తన ప్రాజెక్ట్‌ను తెర మీదకు తెస్తానని మాట ఇచ్చిన దర్శకుడు మాత్రం ఇచ్చిన మాట మరిచిపోయి తన పనిలో తను పడిపోయాడట. దీనిమీద సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతుంది. విషయంలోకి వెళితే..
‘ప్రేమ్ నగర్, చక్రవాకం, ఇంద్రుడు చంద్రుడు, నువ్వు లేక నేను లేను’ వంటి ఎన్నో చిత్రాలను తెరకు ఎక్కించిన ఘనత డి. రామానాయుడిది. అలాగే ఆయన కొడుకులు ఇద్దరూ ఒకరు నిర్మాతగా, మరొకరు హీరోగా తెలుగు ఇండస్ట్రీలో మంచి పేరును అందుకున్నారు.
అయితే హీరోగా వెంకటేష్ పంథా వేరు. తను అన్ని రకాల పాత్రలను, అన్ని రకాల జోనర్స్ ట్రై చేసి విలక్షణ నటుడిగా పేరు సంపాదించాడు. అటు ఫ్యామిలీ ఆడియన్స్‌ని, ఇటు మాస్ ఆడియన్స్‌ని కూడా మెప్పించే విధంగా వెంకటేష్ సినిమాలు చేశాడు.
అయితే తను ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రతిష్టాత్మకమైన డ్రీమ్ ప్రాజెక్ట్‌ని మాత్రం.. ఇన్ని మంచి సినిమాలు తీసినా కూడా ఎవరైనా యంగ్ డైరెక్టర్ చేతిలో పెట్టి తీయాలని ఫిక్స్ అయ్యాడట వెంకటేష్. అయితే అలాంటి సత్తా ఉన్న దర్శకుడు రాజమౌళి అని తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పాడట.
‘స్వామి వివేకానంద’ జీవిత చరిత్రను సినిమాగా తీసుకురావాలనే తన ప్రయత్నాన్ని రాజమౌళితో చెప్పగానే ఆయన ఈ సినిమా చేస్తానని అప్పట్లో మాట కూడా ఇచ్చాడట. అయితే అది ఇప్పటి మాట కాదట.. ‘మగధీర’ రిలీజ్ టైమ్‌లో వెంకటేష్‌కి దర్శకధీరుడు మాట ఇచ్చాడట. అయితే ఆ తర్వాత రాజమౌళి ఎలా బిజీ అయ్యారో తెలియంది కాదు.
ఆ తర్వాత బాహుబలి సిరీస్, ఆర్ ఆర్ ఆర్ ఇలా వరస విజయాలతో దూసుకుపోతూ ఇచ్చిన మాట గురించి మరిచిపోయాడట రాజమౌళి. ఈ క్రమంలోనే వెంకటేష్‌ని రాజమౌళి మోసం చేశాడంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా ఫ్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.
ఇది 3 ప్రాంచైజ్లుగా ఉంటుందని అంటున్నారు. ఈ లెక్కన చూస్తే.. ఇప్పట్లో వెంకీతో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ చేసే అవకాశం లేనట్టే అని చెప్పుకోవాలి. ఈ విషయమై ప్రస్తుతం టాలీవుడ్లో బాగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలపై రాజమౌళి ఎలా స్పందిస్తాడో చూడాలి?