Rakul Preet Singh | వృత్తిపై ప్రేముంటే ఒత్తిడి కాదు.. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది : రకుల్ ప్రీత్ సింగ్
Rakul Preet Singh | కన్నడ సినిమా ‘గిల్లి’ సినిమాతో 2009లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్. తర్వాత ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2013లో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విజయంతో తెలుగుతో పాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి యంగ్‌స్టార్‌తో […]

Rakul Preet Singh | కన్నడ సినిమా ‘గిల్లి’ సినిమాతో 2009లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రకుల్ ప్రీత్‌సింగ్. తర్వాత ‘కెరటం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఢిల్లీ బ్యూటీ. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. 2013లో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా విజయంతో తెలుగుతో పాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.
మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి యంగ్‌స్టార్‌తో నాగార్జున వంటి పలువురు సీనియర్లతోనూ జతకట్టింది. చాలా రోజులపాటు అగ్రహీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నది. ఇటీవల మానసిక ఒత్తిడిపై కీలక వ్యాఖ్యలు చేసింది.
తాను అనుసరించిన, తనకు ప్రేరణ ఇచ్చిన అంశాలను సైతం వివరించింది. దక్షిణాది సినిమా నుంచి బాలీవుడ్ వరకు పెద్ద పెద్ద స్టార్స్‌తో కలిసి నటించాన్న ఢిల్లీ భామ తాను ఎన్నడూ ఒత్తిడికి గురికాలేదని, దీనికి పనిపై తనకున్న ఫ్యాషనే కారణమని తెలిపింది.
వృత్తిపై ప్రేమ ఉన్నవారు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురికారని, పైగా ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని చెప్పింది. వృత్తిపై ప్రేమను కోల్పోయిన వారికి మాత్రమే అసహనం, ఒత్తిడి ఉంటాయని తెలిపింది. తాను ఎన్నడూ ఈ పరిస్థితుల్లో లేననని, తన సక్సెస్ సీక్రెట్ ఇదేనని ఉత్సాహంగా తెలిపింది. రకుల్ వ్యాఖ్యలను విన్నవారంతా అవును నిజమేననంటున్నారు. చేస్తున్న పనిపై అంకితభావం ఉన్నవారికి చిరాకు, బోర్‌గా అనిపించే అవకాశమే ఉండదని కామెంట్ చేస్తున్నారు.