ఏడుస్తున్న చిన్నారితో సెల్ఫీ.. రామ్‌చరణ్ గుండెలు పిండేశాడు
విధాత: గతేడాది రామ్ చరణ్ నటించిన RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలోకి నామినేట్ అయ్యింది. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వేడుక కోసం 20 రోజుల ముందే అమెరికా చేరుకున్నాడు చరణ్. ఆమెరికా వెళ్లిన చరణ్ అక్కడ వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అందులో భాగంగా వరల్డ్ పాపులర్ అయిన గుడ్ మార్నింగ్ అమెరికా (GMA) లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమానికి […]
విధాత: గతేడాది రామ్ చరణ్ నటించిన RRR సినిమా నుంచి నాటు నాటు సాంగ్ ఆస్కార్ బరిలోకి నామినేట్ అయ్యింది. మార్చి 12న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం గ్రాండ్‌గా జరగబోతోంది. ఈ వేడుక కోసం 20 రోజుల ముందే అమెరికా చేరుకున్నాడు చరణ్. ఆమెరికా వెళ్లిన చరణ్ అక్కడ వరుస కార్యక్రమాల్లో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. అందులో భాగంగా వరల్డ్ పాపులర్ అయిన గుడ్ మార్నింగ్ అమెరికా (GMA) లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
అయితే ఈ కార్యక్రమానికి చరణ్ వస్తున్నాడు అని తెలిసి ఫ్యాన్స్ భారీ స్థాయిలో స్టూడియో వద్దకు చేరుకున్నారు. ఇక ప్రోగ్రాం అనంతరం బయటకు రాగానే జనాలంత సెల్ఫీలు, షేక్ హాండ్ల కోసం చుట్టు ముట్టేశారు. జనాలను కంట్రోల్ చేయడానికి సెక్యూరిటీ సిబ్బంది నానా తంటాలు పడ్డారు. చరణ్‌కి అందర్నీ కలిసే అవకాశం దొరకలేదు.
ఈ నేపథ్యంలో చరణ్‌ని కలిసి సెల్ఫీ దిగడానికి ఓ చిన్నారి ఎంతగానో ప్రయత్నాలు చేసింది. అప్పటికే వెళ్లిపోదామని కారు దగ్గరకు వెళ్లిన చరణ్.. చిన్నారి ఏడుపు చూసి చలించి పోయాడు. వెంటనే ఏడుస్తున్న చిన్నారి వద్దకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ దిగాడు. దీంతో ఆ చిన్నారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇదంతా న్యూయార్క్ లోనే టైం స్క్వేర్ దగ్గర జరిగినట్లు సమాచారం.
Mega Power Selfie Moment With His Fans At New York,USA
X

Google News
Facebook
Instagram
Youtube
Telegram