Ravela Kishore Babu | బ్యాక్ టు పెవిలియన్.. మళ్లీ TDPలోకి పయనం
Ravela Kishore Babu విధాత: రావెల కిషోర్ బాబు.. కొద్దీ కాలంలోనే అన్ని రాజకీయ పార్టీలూ తిరిగేసి మళ్ళీ బోర్ కొట్టిందేమో చివరిగా మళ్ళీ టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే అధికారిగా ఉంటూ కెరీర్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పత్తిపాడు నుంచి గెలిచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే నోటి దురుసు.. క్యాడర్‌ను సమన్వయం చేసుకోలేకపోవడం, సింగిల్ హ్యాండెడ్‌గా, ఇష్టానుసారం వ్యవహరించడం.. ఇవన్నీ […]

Ravela Kishore Babu
విధాత: రావెల కిషోర్ బాబు.. కొద్దీ కాలంలోనే అన్ని రాజకీయ పార్టీలూ తిరిగేసి మళ్ళీ బోర్ కొట్టిందేమో చివరిగా మళ్ళీ టిడిపిలోకి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రైల్వే అధికారిగా ఉంటూ కెరీర్ వదులుకుని రాజకీయాల్లోకి వచ్చి 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున ఎమ్మెల్యేగా పత్తిపాడు నుంచి గెలిచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.
అయితే నోటి దురుసు.. క్యాడర్‌ను సమన్వయం చేసుకోలేకపోవడం, సింగిల్ హ్యాండెడ్‌గా, ఇష్టానుసారం వ్యవహరించడం.. ఇవన్నీ కలగలిసి ఆయన్ను మధ్యలోనే పదవీ భ్రష్టుడు అవడానికి కారణమయ్యాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ను మధ్యలోనే పదవిలో నుంచి తొలగించారు .
అంతేకాకుండా 2019లో ఆయనకు టికెట్ కూడా ఇవ్వలేదు. ఆ పత్తిపాడు నుంచి మాణిక్య వరప్రసాదరావు ను టిడిపి బరిలోకి దించింది. దీంతో యమాస్పీడుగా రావెల జనసేనలో చేరి అక్కడ పోటీ చేసారు.. మొత్తానికి అక్కడ వైసిపి అభ్యర్థి మేకతోటి సుచరిత ఎమ్మెల్యేగా గెలిచారు.
ఇక ఎన్నికల అనంతరం కేంద్రంలో బిజెపి అధికారంలోకి రావడంతో ఏం ఊహించారో కానీ వెంటనే బీజేపీలో చేరారు.. నాలుగైదు నెలలు బిజెపి కండువా వేసుకుని హడావుడి చేసిన రావెల… కొన్నాళ్ళు మళ్ళీ బయట కనిపించలేదు.. సైలెంట్ గా ఉండిపోయారు. ఆ తరువాత తోట చంద్రశేఖర్ తో కలిసి కేసీఆర్ పెట్టిన భారత రాష్ట్ర సమితిలో చేరారు. అక్కడ కొన్నాళ్ళు హడావుడి చేసారు.
హైదరాబాద్ వెళ్లి కేసీఆర్ ను కలిశారు. కొన్నాళ్ళు అటు ఇటు తిరిగి ఫోటోలు దిగారు. మళ్ళీ ఏం పుట్టిందో తెలీదు అక్కడ కూడా చేయడానికి ఏమీ లేదని గ్రహించారో ఏమో… మళ్ళీ టిడిపిలో చేరేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
మరి ఆయనకు చంద్రవాబు టికెట్ ఇస్తారా.? ఆయన్ను చేర్చుకుని ఎలా ఉపయోగించుకుంటారు. ఇవన్నీ ప్రస్తుతానికి క్లారిటీ లేదు కానీ మొత్తానికి ఆయన చివరిగా చేరడానికి పార్టీలు ఏమీ లేనందున మళ్ళీ టిడిపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయ్ అంటున్నారు.
ప్రస్తుతానికి అక్కడ పోటీ చేసేందుకు ఖాళీ లేదు కాబట్టి వైసిపిలోకి వెళ్లే అవకాశం లేదు.. దానికి తోడు ఆయన్ను భరించడం కష్టము అనే ప్రచారం ఉండడంతో వైసిపిలోకి ఎంట్రీ కూడా కష్టమే. అందుకే మళ్ళీ టిడిపిలోకి పయనిస్తారని అంటున్నారు. మొత్తానికి ఆయన.
తెలుగుదేశం నుంచి జనసేన,
జనసేన నుంచి బీజేపీ,
బీజేపీ నుంచి బీఆర్ఎస్,
బీఆర్ఎస్ నుంచి మళ్లీ టీడీపీ లోకి చేరుతున్నట్లు లెక్క..