RC16 | ఎంత పని జరిగింది.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ తప్పదా!

RC16 | ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా ఇప్పటి వరకూ మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ పదహారవ చిత్రం (RC16) కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇది ఈ సంవత్సరం ఆఖరులో పూజా కార్యక్రమాలు జరుపుకొని వచ్చే ఏడాది పట్టాలెక్కనుందనేలా టాక్ వినబడుతోంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 అదే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ దశలో ఉంది. రామ్ చరణ్ తన పదహారో సినిమాను బుచ్చిబాబుతో చేయబోతున్నారు. […]

  • By: krs    latest    Jul 27, 2023 5:13 AM IST
RC16 | ఎంత పని జరిగింది.. రామ్ చరణ్ ఫ్యాన్స్‌కి మరోసారి నిరాశ తప్పదా!

RC16 |

ఆర్‌ఆర్‌ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ సోలో హీరోగా ఇప్పటి వరకూ మరో సినిమా విడుదల కాలేదు. ప్రస్తుతం రామ్ చరణ్ పదహారవ చిత్రం (RC16) కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇది ఈ సంవత్సరం ఆఖరులో పూజా కార్యక్రమాలు జరుపుకొని వచ్చే ఏడాది పట్టాలెక్కనుందనేలా టాక్ వినబడుతోంది.

మరోవైపు శంకర్ దర్శకత్వంలో చేస్తున్న RC15 అదే ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ దశలో ఉంది. రామ్ చరణ్ తన పదహారో సినిమాను బుచ్చిబాబుతో చేయబోతున్నారు. ఇది ఈపాటికే మొదలుకావాల్సి ఉన్నా స్క్రిప్ట్ లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి రావడంతో కాస్త సమయం పట్టేలా ఉందని అంటున్నారు.

పైగా ఈమధ్య భార్య ఉపాసన ప్రసవం సందర్భంగా మూడు నెలల పాటు తన షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకుని మరీ భార్య దగ్గర ఉండిపోయాడు చరణ్. పాప పుట్టాకా కూడా బిడ్డతో ఆడుకోవాలనే ఆలోచనతో ఇలా గ్యాప్ తీసుకున్నాడు. రామ్ చరణ్ ఫ్యామిలీతో విషయాలతో బిజీ కావడం, మరో పక్క స్క్రిప్ట్ మార్పులతో బుచ్చిబాబు సినిమా మరింత ముందుకు వాయిదా పడింది.

దర్శకుడు బుచ్చిబాబు మూవీకి RC16 అనే పేరు ఖరారైంది. దీనికి చరణ్ డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్‌తో కనిపించాల్సి ఉంది. అయితే ఓ పక్క శంకర్ మూవీ కమిట్ అయ్యి ఉండటం వల్ల అలాగే ఫిట్నెస్ విషయంలో కూడా కొద్దిగా మార్పులు చేయాల్సి ఉండటం కారణంగా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరింత లేట్ అవ్వవచ్చనేలా ఇండస్ట్రీలో వర్గాల్లో వినబడుతోంది. అందుకే శంకర్‌తో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ పూర్తయ్యే వరకూ RC16 మూవీకి జోలికి వెళ్లకూడడని చరణ్ కూడా ఫిక్సయినట్లుగా సమాచారం. సో.. ఇప్పట్లో RC16కు ముడి పడే అవకాశం లేదు.

ఏడాది చివరికల్లా అనుకున్నట్టుగా అన్నీ అయితే బుచ్చిబాబు రిలీజ్ విషయంగా కూడా మంచి ఫ్లాన్ గీసుకున్నాడట. RC16 ఫినిష్ కావడానికి దాదాపు ఏడాది టైం పట్టే అవకాశాలున్నాయి. అదేవిధంగా ఈ సినిమా విషయంలో రోజుకోరకమైన ఆసక్తికర విషయాలు సోషళ్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడిగా ఏఆర్‌ రెహమాన్‌, డీవోపీగా రత్నవేలు, మరో ఇంట్రెస్టింగ్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి, హీరోయిన్‌గా జాన్వీ కపూర్‌ నటిస్తన్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇదిలాఉంటే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు 2025లో సంక్రాంతికో, సమ్మర్ కో వచ్చే అవకాశాలున్నాయి. చరణ్ కూడా బుచ్చిబాబుకి అనుకూలంగా డేట్స్ ఫ్లాన్ చేస్తే.., అన్నీ అనుకున్నట్టుగా అయితే 2025లో చరణ్ 16వ సినిమా ఫ్యాన్స్ ముందుకు వస్తుంది. అయితే ఇంత గ్యాప్ అంటే.. మెగా ఫ్యాన్స్ మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే.. బాక్సాఫీస్ వద్ద రేస్ అలా ఉంది మరి.