Realme Narzo | 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా..! అమెజాన్‌లో రియల్‌మీ నార్జో మొబైల్‌లో భారీ డిస్కౌంట్ ఆఫర్..!
రియల్ మీ స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. కంపెనీకి చెందిన రియల్‌మీ నార్జో 60 5జీ ఫోన్ కొనుగోలుపై ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్

Realme Narzo | రియల్ మీ స్మార్ట్ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. కంపెనీకి చెందిన రియల్‌మీ నార్జో 60 5జీ ఫోన్ కొనుగోలుపై ప్రముఖ ఈకామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. రియల్ మీ నార్జో 60 5జీ (మార్స్ ఆరెంజ్, 8జీబీ+128జీబీ వేరియంట్) వేరియంట్ మొబైల్ ప్రస్తుతం రూ.14,999కే అందుబాటులో ఉన్నది. అయితే హై ఫెర్పార్మెన్స్ స్మార్ట్ మొబైల్ ధరను తక్కువ ధరకు అందుబాటులో ఉంచడం ఇదే తొలిసారి. తగ్గింపుతో పాటు అమెజాన్‌లో అందుబాటులో ఆఫర్స్, డిస్కౌంట్స్ సైతం వర్తించనున్నాయి. ఈ 5జీ మొబైల్ ఫోన్ కొనుగోలుపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ సైతం అందుబాటులో ఉన్నది. వడ్డీ ఛార్జీలు లేకుండానే స్మార్ట్‌ఫోన్‌ను మీ సొంతం చేసుకునే వీలున్నది. హెచ్‌ఎస్‌బీసీ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉన్న వారికి అదనపు డిస్కౌంట్ ఆఫర్ వర్తించనున్నది. దాంతో పాటు రియల్ మీ నార్జో 60 5జీ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునే యూజర్లు పాత స్మార్ట్ మొబైల్‌ను సైతం ఎక్స్ఛేంజ్ చేసుకునే అవకాశం ఉండగా.. రూ.11,250 వరకు గరిష్ఠంగా తగ్గింపు లభించనున్నది. దీనికి అదనంగా పార్టనర్‌షిప్ ఆఫర్లలో వ్యాపార కొనుగోళ్లపై 28శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తున్నది. ఇక స్మార్ట్ మొబైల్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే ఈ రియల్ మీ నార్జో 60 5జీ మొబైల్ 90 హర్ట్‌జ్ రిఫ్రెజ్ రేట్‌తో సూపర్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. అల్ట్రా స్లిమ్ ప్రీమియం డిజైన్‌తో లగ్జరీ లుక్‌ను ఇస్తుంది. ఇందులో శక్తివంతమైన 64 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉంటుంది.