Regina | పోర్న్‌స్టార్ అవ్వాలనుకుంది నిజమే.. కానీ ఆ తర్వాత చెప్పేది  వినాలిగా..

Regina | విధాత స్టార్స్ మామూలుగా మాట్లాడినా ఒక్కోసారి వేరే మీనింగ్‌లో రచ్చ రచ్చ అవుతాయి. ఇక అక్కడి నుంచి వాటిని చిలవలు పలవలు చేసి వైరల్ చేయడంలో సోషల్ మీడియా ఉండనే ఉంది. ఈమధ్య రెజీనా మాటల గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఆమె మాట్లాడిన ఉద్దేశ్యం ఏదైనా బయటికి వేరే మీనింగ్‌తో రావడం ఏంటో కానీ.. పెద్ద పంచాయితీ అయి కూర్చుంది. ఇంతకీ తన కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటంటే.. ఓ ఛానల్‌కి […]

  • By: krs    latest    Jul 24, 2023 10:54 AM IST
Regina | పోర్న్‌స్టార్ అవ్వాలనుకుంది నిజమే.. కానీ ఆ తర్వాత చెప్పేది  వినాలిగా..

Regina |

విధాత స్టార్స్ మామూలుగా మాట్లాడినా ఒక్కోసారి వేరే మీనింగ్‌లో రచ్చ రచ్చ అవుతాయి. ఇక అక్కడి నుంచి వాటిని చిలవలు పలవలు చేసి వైరల్ చేయడంలో సోషల్ మీడియా ఉండనే ఉంది. ఈమధ్య రెజీనా మాటల గురించి నెట్టింట చర్చలు జరుగుతున్నాయి. ఆమె మాట్లాడిన ఉద్దేశ్యం ఏదైనా బయటికి వేరే మీనింగ్‌తో రావడం ఏంటో కానీ.. పెద్ద పంచాయితీ అయి కూర్చుంది. ఇంతకీ తన కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటంటే..

ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెజీనా తన మనసులో మాటలను కామెంట్స్ రూపంలో బయటపెట్టింది. తన చిన్నతనం నుంచే సినిమాల్లోకి రావాలనుకున్నానని, కానీ ఇండస్ట్రీ గురించి సరిగ్గా తెలియకపోవడం తో రాలేక పోయానని చెప్పింది. హీరోయిన్‌గా గ్లామర్ పాత్రల్లో కనిపించడం ఇష్టమని, కాకపోతే ఆ పాత్రలను కాస్త హద్దుల వరకే ఒప్పుకుంటానని చెప్పుకొచ్చింది.

ఇలా చెబుతూనే కొందరు పోర్న్ స్టార్స్, హాట్ స్టార్స్ అనే మాటలు విన్నప్పుడు నేను కూడా వాళ్లలా కావాలనుకునే దాన్నని.. సన్నీలియోన్‌లాగా పేరు తెచ్చుకోవాలని ఉండేదని అంది. అంతే రెజీనా పోర్న్ స్టార్ కావాలనుకుందట.. అంటూ కామెంట్స్ కుమ్మేస్తున్నారు. కానీ ఆమె చెప్పింది మాత్రం పూర్తిగా ఎక్కించుకోలేదు. ఇంకా రెజీనా ఏమందంటే.. ఆ వయసులో అర్థం తెలియక అలా అనుకునే దాన్నని.. మీనింగ్ తెలిశాక నాలిక కరుచుకున్నానని చెప్పింది.

ఇంతటితో ఆపకుండా బోల్డ్ సీన్లలో నటించడం కల్పితం అయినపుడు అందులో నటించడం అంత పెద్ద తప్పు ఎందుకు అవుతుంది? అని అంది. ఆ మాటలే అర్థం కాని తికమకలో పడేశాయి. ఈ కామెంట్స్ రెజీనా ఏ ఆలోచనతో చేసినా అది రాంగ్ వేలోనే కన్వే అవడంతో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మధ్యకాలంలో నెగెటివ్ వేలో మాట్లాడటం, ఎక్స్‌పోజింగ్ డోస్ పెంచడమే హీరోయిన్స్‌కి అవకాశాలు తెచ్చి పెడుతున్నాయని.. దాని కోసమే రెజీనా ఇలాంటి కామెంట్స్ చేసిందని కొందరు అంటుంటే.. మరికొందరేమో రెజీనా అమాయకంగానే అనుంటుందని వెనకేసుకొస్తున్నారు. మరి పరమార్థం ఏమిటనేది ఆ పైవాడికే ఎరుక.

2012లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. ‘పిల్లా నువ్వులేని జీవితం, కొత్త జంట’ వంటి సినిమాలతో ఫేమస్ అయింది. రవితేజ వంటి స్టార్ హీరోస్‌తో నటించిన రెజీనా, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ ఆకట్టుకుంది. ఇక తమిళంలో నటిగా మారినా, అమ్మడు ప్రస్తుతం అవకాశాల్లేక ఖాళీగానే ఉంటుంది. అందుకే ఆమె నార్మల్‌గా చెప్పినా.. ఏదో మర్మం ఉందనేలా టాక్‌కు కారణమవుతున్నాయి.