Renu Desai | పాపం అటు, ఇటు నలిగిపోతోందిగా.. దీనికంటే ఆ పని చేస్తే బెటర్!
Renu Desai | రేణూ దేశాయ్ ఈ పేరు ఓ హీరోయిన్‌గా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా, మాజీ భార్యగా అందరికీ గుర్తుండిపోయింది. చాలాకాలం సహజీవనం చేశాక, ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యాక కానీ వీళ్ళిద్దరూ వివాహం చేసుకోలేదు. మొత్తంగా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏవో కారణాలతో పవన్, రేణూ విడాకులు తీసుకుని విడిపోయారు. రేణూ.. పవన్ జీవితంలో లేకపోయినా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నుంచి ట్రోల్స్, కామెంట్స్ తప్పడం లేదు. […]

Renu Desai |
రేణూ దేశాయ్ ఈ పేరు ఓ హీరోయిన్‌గా కంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్యగా, మాజీ భార్యగా అందరికీ గుర్తుండిపోయింది. చాలాకాలం సహజీవనం చేశాక, ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యాక కానీ వీళ్ళిద్దరూ వివాహం చేసుకోలేదు. మొత్తంగా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఏవో కారణాలతో పవన్, రేణూ విడాకులు తీసుకుని విడిపోయారు. రేణూ.. పవన్ జీవితంలో లేకపోయినా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నుంచి ట్రోల్స్, కామెంట్స్ తప్పడం లేదు.
రేణూ దేశాయ్ ఏం మాట్లాడినా అది సోషల్ మీడియాలో సంచలనంగా మారుతుంది. ఇక విడిపోయి ఎంతకాలం అయినా కూడా రేణూ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశించి చేసే కామెంట్స్ విషయంగా వివాదాస్పదం అవుతూనే వస్తుంది. ఆమె పవన్‌కు వ్యతిరేకంగా చేసే కామెంట్స్ వెనుక వేరే ఎవరో ఉన్నారనే ధోరణిలో ఫ్యాన్స్ రేణూ దేశాయ్ మీద ప్రతి సారీ విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే తాజాగా మరో వాదనలో రేణూ దేశాయ్ పేరు కాస్త గట్టిగానే వినిపిస్తుంది. విషయంలోకి వెళితే…
పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ ఇద్దరూ విడిపోయి చాలా కాలం అవుతున్నా ఆయన రేణూకి, పవన్ ఫ్యాన్స్ కి మధ్య వార్ నడుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ ని ఎంత వ్యతిరేకించినా మొదటిసారి రేణూ దేశాయ్ మాజీ భర్త గురించి రీసెంట్‌గా పాజిటివ్ వేలో మాట్లాడింది. పవన్ కళ్యాణ్ నా విషయంలో విడిపోయి తప్పు చేశారేమో కానీ ఆయన స్వతహాగా సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి. ఆయనకు డబ్బు మీద ఎలాంటి వ్యామోహం లేదని చెప్పు కొచ్చింది.
అయితే పాజిటివ్‌గా మాట్లాడినా కూడా ఈ కామెంట్స్ కూడా వివాదం అయ్యాయి. పవన్ కళ్యాణ్ యాంటీ ఫ్యాన్స్ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రేణూ దేశాయ్ మీద విరుచుకు పడ్డారు. ఈ విషయంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా పెరిగాయి. ఎవరి నుంచో డబ్బులు తీసుకునే రేణూ దేశాయ్ ఇలా మాట్లాడుతుందనే కోణంలో ఆమెను ట్రోల్ చేస్తున్నారు.
దీని మీద రేణూ మళ్ళీ కౌంటర్ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ మీద మాట్లాడి నప్పుడు ఫ్యాన్స్ వేధించారు. ఆయనకు మద్దతుగా మాట్లాడినా యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్, కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఆ వ్యక్తిని ప్రేమించినందుకు, నిజం మాట్లాడినందుకు నేనే మూల్యం చెల్లిస్తున్నానని ఎమోషనల్‌గా పోస్ట్ పెట్టింది.
నన్ను తిట్టాలంటే తిట్టండి, విడాకులు విషయంలో పవన్ కళ్యాణ్‌కు మాజీ భార్యగా మాట్లాడాను. ఇప్పుడు ఓ సిటిజన్‌గా నా అభిప్రాయాన్ని తెలియజేశాను. ఇక్కడ సందర్భాలు రెండూ వేరు వేరు. అయినా వేధింపులు గురయ్యేది మాత్రం నేనే అని ఆవేదన వ్యక్తం చేసింది. నిజమే పాపం.. రెండు వైపులా రేణూ దేశాయ్ నలిగిపోతుంది. వీటన్నింటి కంటే కూడా.. కామ్‌గా అంటే ఇవేవీ పట్టించుకోకుండా.. తన పని తను చేసుకుంటూ వెళ్లిపోతే బెటర్ అని ఆమె సన్నిహితులు సలహాలు ఇస్తున్నారట.