• Telugu News
  • /Latest

Warangal | మోరంచపల్లిలో మొదలైన రెస్క్యూ ఆపరేషన్

Warangal విధాత, వరంగల్‌ ప్రతినిధి: ఎట్టకేలకు మొరంచపల్లి గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమయ్యిది. అగ్నిమాపక శాఖ బృందం మోరంచపల్లి గ్రామానికి చేరుకుంది. నీళ్లలో చిక్కుకుపోయిన గ్రామస్తులను రెస్క్యూటివ్ రక్షిస్తోంది. 200కు పైగా ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. వెయ్యిమంది గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. భూపాలపల్లి-పరకాల జాతీయ రహదారిపై ఆరు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహిస్తోంది. ఇదిలా ఉండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం […]

Reported by: Somu | latest | IST
Read Time: 4 mins
Warangal | మోరంచపల్లిలో మొదలైన రెస్క్యూ ఆపరేషన్

Warangal

విధాత, వరంగల్‌ ప్రతినిధి: ఎట్టకేలకు మొరంచపల్లి గ్రామంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమయ్యిది. అగ్నిమాపక శాఖ బృందం మోరంచపల్లి గ్రామానికి చేరుకుంది. నీళ్లలో చిక్కుకుపోయిన గ్రామస్తులను రెస్క్యూటివ్ రక్షిస్తోంది. 200కు పైగా ఇళ్లల్లోకి వరద నీరు చేరుకుంది. వెయ్యిమంది గ్రామస్తులు వరదలో చిక్కుకున్నారు. భూపాలపల్లి-పరకాల జాతీయ రహదారిపై ఆరు అడుగుల ఎత్తులో వరదనీరు ప్రవహిస్తోంది.

ఇదిలా ఉండగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొరంచపల్లి గ్రామం జలదిబ్భంధనంలో చిక్కుకుంది. గ్రామంలోని వెయ్యిమందికి పైగా ప్రజలు ఈ వరద చుట్టుముట్టడంతో.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.

తెల్లవారు జామున నాలుగు గంటల ప్రాంతంలో వదర ఉదృతి ఒక్కసారిగా పెరిగడంతో ప్రజలు తమను రక్షించాలని హహకారాలు చేస్తూ, ఇళ్లమీదకు ఎక్కి వరదలో కొట్టుకు పోకుండా తమను తాము కాపాడుకున్నారు. తెల్లవారుజాము నుంచి తాము సహాయం కోసం ఎదురుచూస్తున్నామని.. ఇప్పటి వరకు ఎవరు తమను రక్షించడానికి రాలేదన్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తమ సహాయం కోసం ఎదురుచూస్తున్నామని అంటున్నారు.

కాగా.. ఉదయం నాలుగు గంటల నుంచి వరద నీరు ఇళ్లల్లోకి వచ్చింది. ఊరు మొత్తం జలదిగ్బంధంలో ఉంది. ఊరు చుట్టూ నీళ్లే ఉన్నాయి. ఊర్లోకి వచ్చే రోడ్డు మార్గాలు లేవు. బోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆదవేదన వ్యక్తం చేశారు. తమను హెలికాప్టర్‌ ద్వారానైనా కాపాడాలని కోరుతున్నారు. అయితే మోరంచ పరిస్థితిని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కాపాడేందకు రెస్క్యూటీమ్‌తో పాటు రెండు హెలికాప్టర్లను కూడా పంపించింది. దీంతో అక్కడ రెస్క్యూ టీమ్‌ తమ ఆపరేషన్‌ మొదలు పెట్టింది.