Revanth Reddy | కాంగ్రెస్‌కు జోడెడ్లు.. పొంగులేటి, జూపల్లిలు: రేవంత్ రెడ్డి
Revanth Reddy పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటీ వర్షాలతోనే కొల్లాపూర్ సభ వాయిదా.. త్వరలోనే జూపల్లి చేరిక విధాత: కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు జోడేద్దుల వంటివారని, పార్టీ బలోపేతం వారు మునుముందు మరింత క్రియాశీలకంగా పనిచేస్తారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామితులైన పొంగులేటి మంగళవారం తొలిసారిగా గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్యులను కలిశారు. ఈ సందర్భంగా […]

Revanth Reddy
- పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా పొంగులేటీ
- వర్షాలతోనే కొల్లాపూర్ సభ వాయిదా.. త్వరలోనే జూపల్లి చేరిక
విధాత: కాంగ్రెస్ పార్టీకి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావులు జోడేద్దుల వంటివారని, పార్టీ బలోపేతం వారు మునుముందు మరింత క్రియాశీలకంగా పనిచేస్తారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామితులైన పొంగులేటి మంగళవారం తొలిసారిగా గాంధీభవన్‌కు వచ్చి పీసీసీ చీఫ్ రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్యులను కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ ప్రచార కమిటీ కో చైర్మన్‌గా నియామితులైన పొంగులేటిని సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ నెల 20న మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో జూపల్లి తలపెట్టిన కాంగ్రెస్ బహిరంగ సభ వర్షాల కారణంగా వాయిదా వేశామన్నారు. నెలాఖరులోగా లక్షలాది మందితో మహబూబ్‌నగర్ జిల్లాలో భారీ సభ నిర్వహించడం జరుగుతుందని, ఆసభలో జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లో చేరుతారన్నారు.
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతు ప్రచార కమిటీ కో చైర్మన్ బాధ్యతలు ఇచ్చిన ఏఐసీసీ, పీసీసీ నేతలకు కృతజ్ఖలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకరావడానికి కష్టపడి పనిచేస్తానన్నారు.
తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా అని, కొట్లాడి బలిదానాలతో తెచ్చుకున్న తెలంగాణలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదన్నారు. కల్వకుంట్ల కుటుంబం రాజుల పాలన సాగుతుందన్నారు. ఉద్యమ కాలంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవి అమలు చేయడం లేదని, బీసీలకు లక్ష సాయం, దళిత బంధు, రెండో విడత గొర్రెల పథకం, గృహలక్ష్మీ వంటి పథకాలను లాంచింగ్ చేయడం తప్పా అమలు చేయడం లేదని విమర్శించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. అధికార మధంతో బిఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారన్నారు.
సోనియా తెలంగాణ ఇవ్వకుంటే కల్వకుంట కుటుంబం ఎక్కడ ఉండేదన్నారు. కేసీఆర్ దీక్ష చేస్తేనే రాష్ట్రం రాలేదని, ప్రజలను మభ్యపెట్టి రెండు సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చాడని, ఆచరణ సాధ్యంకాని హామీలతో మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. నాపై రాజకీయ కక్ష్య సాధింపు లకు బీఆర్ఎస్ దిగుతుందని, నేను కేవలం 20 గుంటల భూమి కబ్జా చేసానంటే ఎవరైనా నమ్ముతారా అని పొంగులేటి ప్రశ్నించారు.
నాపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుందని, నేను న్యాయస్థానాన్ని ఆశ్రయించానని, నేను ఖబ్జా చేసినట్లు తెలితే నా భూమి మొత్తం రాసిస్తానన్నారు. ఎస్సార్ గార్డెన్ పడగొట్టాలని చూసారని, అది కట్టి 13సంవత్సరాలైందని, అప్పుడేందుకు సర్వే చేయలేదన్నారు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓకలా, పార్టీ మారాక ఇప్పుడు ఓకలా ప్రభుత్వం వ్యవహారిస్తుందన్నారు. కాంగ్రెస్ పై విమర్శల దాడి పెరిగిందంటేనే..కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అందరికి అర్ధమైందన్నారు.